మట్టి తవ్వకాలపై టీడీపీ నేత దేవినేని ఉమ కీలక వ్యాఖ్యలు

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని అక్రమ మట్టి తవ్వకాలపై టీడీపీ నేత దేవినేని ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు.

అటవీ మరియు అసైన్డ్ భూముల్లో అడ్డగోలుగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని మండిపడ్డారు.

తవ్వకాల్లో సీఎం బంధువులు, అనుచరులదే కీలక పాత్రని దేవినేని ఉమ ఆరోపించారు.నిత్యం వందలాది లారీల్లో మట్టిని తరలిస్తున్నారని చెప్పారు.

దళిత రైతుల భూములను లాక్కుని మరీ మట్టి తవ్వుతున్నారని విమర్శించారు.ఈ తవ్వకాలలో జలవనరుల శాఖా మంత్రి అనుచరులదే కీలక పాత్రంటూ ఆరోపణలు చేశారు.

ఈ నేపథ్యంలో దోపిడీకి పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players