వైసీపీ నేతలపై దేవినేని ఉమ ఘాటు వ్యాఖ్యలు.. ??

ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య రాజకీయ రగడ సలసల కాగుతుంది.

ఈరోజు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఫలితంగా బెజవాడ రాజకీయం వేడెక్కిందట.అయితే కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీసు స్టేషన్‌ నుంచి కొద్దిసేపటి క్రితం విడుదలైన ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మంత్రి కొడాలి నానిపై ఎవరు ఊహించని స్థాయిలో ధ్వజమెత్తి, బూతుల మంత్రి కాస్తా ఇవాళ పోరంబోకు మంత్రి అయ్యాడని, ఇతనికి చదువుతో పాటు సంస్కారం కూడా లేదని పలు విమర్శలు చేశారట.

Tdp Leader Devineni Uma Comments On Ycp Leaders,TDP, Devineni Uma, Kodali Nani,

ఇంతటితో ఆగకుండా వైసీపీ నేతలైన వంశీ, కృష్ణప్రసాద్‌ల పై ఫైర్ అయ్యాడట.ఇక కొడాలి నాని ప్రవర్తనను నిరసిస్తూ దీక్ష చేస్తానంటే అడ్దుకున్న పోలీసులు అక్కడ 144 సెక్షన్‌తో పాటుగా పోలీస్ యాక్ట్ అమల్లో ఉండగా వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకాలు చేస్తుంటే చోద్యంగా చూడటమే కాకుండా మమ్మల్ని బూతులు తిట్టడం కూడా జరిగింది.

ఇలాంటి సంఘటనలన్నీంటికి వైసీపీ పార్టీ అధినేత అయిన సీఎం జగన్ సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారట.

Advertisement

తాజా వార్తలు