మళ్లీ అరెస్ట్ అయినా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చింతమనేని ప్రభాకర్ పేరు తెలియని వారు ఉండరు.

టిడిపి పార్టీలో రెబల్ నేతగా చాలా దూకుడుగా వ్యవహరించే చింతమనేని ప్రభాకర్ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం కి చెందినవారు.

చంద్రబాబు హయాంలో దెందులూరు ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో నిండు అసెంబ్లీ లో వైయస్ జగన్ ని మరియు ఆయన కుటుంబాన్ని భారీ స్థాయిలో విమర్శలు చేసిన నేతగా అప్పట్లో వార్తల్లో నిలవడం అందరికీ తెలిసిందే.ఒక జగన్ ని విమర్శించడమే కాకుండా వనజాక్షి అనే మహిళ అధికారిని జుట్టు పట్టుకుని కొట్టడం, ఇంకా అనేక విషయాలలో చింతమనేని వార్తల్లో నిలిచేవారు.

అటువంటిది ఆయన 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన పై ఉన్న పాత కేసుల విషయంలో దాదాపు 60 రోజుల పాటు జైల్లో ఉండటం జరిగింది.  ఇదిలా ఉండగా ఇటీవల లోకల్ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో.

దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం లో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి భర్త శామ్యూల్ అనే వ్యక్తిని.చింతమనేని అదేవిధంగా ఆయన అనుచరులు దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఆయనను అరెస్టు చేశారు.

Advertisement
Tdp Ex Mla Chinthamaneni Prabhakar Arrested Again, Chinthamaneni Prabhakar,tdp,d

గురువారం ఆయనను పెదవేగి పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.చింతమనేని పై అదేవిధంగా అనుచరులపై ఐసిసి సెక్షన్ 341,324,143,323,354,354a,171సి, 506(2), 455r/w 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వార్తలు అందుతున్నాయి.

మరికాసేపట్లో ఆయనను న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తున్నట్లు సమాచారం.

Tdp Ex Mla Chinthamaneni Prabhakar Arrested Again, Chinthamaneni Prabhakar,tdp,d

తాజా వార్తలు