ఏపీలో మద్యం అమ్మకాలపై టీడీపీ మాజీ మంత్రి సీరియస్ కామెంట్స్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విషయంలో అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష పార్టీ టిడిపి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో కల్తీ సారా తాగడం వల్ల కొంత మంది మరణించినట్లు.

దీంతో ప్రభుత్వం పై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో టీడీపి నేతలు .ప్రశ్నించడం జరిగింది.కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయని ఇటీవల ప్రభుత్వ అధికారులు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ తెలియజేశారు.

ఈ క్రమంలో ఈ ప్రకటనపై టీడీపీ మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు.రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని చెబుతున్న ప్రభుత్వం దానిపై ఆదాయం ఏకంగా 200 శాతం పెరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందని సీరియస్ అయ్యారు.

ఇటువంటి తప్పుడు ప్రకటనలు మానుకోవాలని సూచించారు.కల్తీ సారా మరణాలను కూడా సహజ మరణాలు చిత్రీకరిస్తూ ప్రభుత్వం మాట్లాడటం.మృతుల కుటుంబాలను అవమానించడమేనని చెప్పుకొచ్చారు.

Advertisement

రాష్ట్రంలో సారా నీ అరికట్టాలని జవహర్ కోరారు.

Advertisement

తాజా వార్తలు