వైసీపీ మేనిఫెస్టో పై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) శనివారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో( Kakinada ) ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీది ప్రజా మేనిఫెస్టో, జగన్ ది నకిలీ నవరత్నాలు అంటూ సెటైర్లు వేశారు.

జగన్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో( Jagan Manifesto ) వెలవెల బోయిందని విమర్శించారు.ఇదే సమయంలో మహిళలకు గుడ్ న్యూస్ తెలిపారు.

మహిళలకు సంవత్సరానికి ₹18000 ఇస్తానని హామీ ఇచ్చారు.చదువుకునే విద్యార్థులకు కూడా కీలక హామీ ఇవ్వడం జరిగింది.

ప్రతి ఏడాది ₹15000 రూపాయలు ఇస్తామని పేర్కొన్నారు.

Tdp Chief Chandrababu Satires On Ycp Manifesto Details, Chandrababu, Ycp Manife
Advertisement
TDP Chief Chandrababu Satires On YCP Manifesto Details, Chandrababu, YCP Manife

ఉచిత గ్యాస్ సిలిండర్లపైన కీలక హామీ ఇచ్చారు.ప్రతి ఏడాది దీపం పథకం ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ( Mega DSC ) నిర్వహిస్తామని.ఆ ఫైలు పైన తొలి సంతకం పెడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

జరగబోయే ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు.

Tdp Chief Chandrababu Satires On Ycp Manifesto Details, Chandrababu, Ycp Manife

ప్రజల కోసం తెలుగుదేశం-జనసేన-బిజెపి పొత్తులు( TDP BJP Janasena Alliance ) పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో రాష్ట్ర అప్పులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం జగన్ వల్ల రాష్ట్రానికి 13 లక్షల కోట్ల అప్పు మిగిలిందని ఆరోపించారు.

వామ్మో.. ఇంగువతో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?

రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయన్నారు.రాష్ట్ర పోలీసు వ్యవస్థ పైన కూడ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

జగన్ మాట వినని పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించారని ఆరోపించారు.ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో కూటమి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు ప్రజలను కోరడం జరిగింది.

తాజా వార్తలు