ఆదిలోనే హంసపాదు ! ఇదేంటి బాసూ..?

ఏపీలో అధికార పార్టీ వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టిడిపి, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.

రెండు పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేసి అధికార పీఠాన్ని పంచుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి.

జనసేన,  టిడిపి( TDP , JANA SENA ) ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏపీని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తామని ఇప్పటికే రెండు పార్టీల అధినేతలు ప్రకటించారు.అయితే ఈ పొత్తు వ్యవహారపై టిడిపిలో పెద్దగా అసంతృప్తి లేకపోయినా, జనసైనికులు మాత్రం ఈ విషయం లో తీవ్ర అసంతృప్తి తోనే ఇంకా ఉన్నారు.

 ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి జనసేన సత్తా చాటుకోవాలని,  టిడిపిని ఆ పార్టీ అధినేత చంద్రబాబును పూర్తిగా నమ్మలేమని,  ఎక్కడికక్కడ జనసేన నాయకులు తమ అసంతృప్తిని మొదట్లోనే వెళ్లగక్కారు.అయితే వైసీపీని అధికారం కి దూరం చేయాలి అంటే రెండు పార్టీలు కలవక తప్పని పరిస్థితి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నాయకులు,  కార్యకర్తలకు స్పష్టం చేశారు .ఇదిలా ఉంటే ప్రస్తుతం టిడిపి జనసేన సమన్వయ కమిటీ సమావేశాలు నియోజకవర్గల్లో మొదలయ్యాయి.  అయితే ఇక్కడ రెండు పార్టీల నేతల మధ్య భేదాభిప్రాయాలు తెరపైకి వచ్చి కొట్టుకునే వరకు పరిస్థితి వెళుతోంది.

తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం నియోజకవర్గ సమన్వయ సమావేశంలో పెద్ద వివాదమే చోటుచేసుకుంది .టిడిపి జనసేన పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో మొదలైన వివాదం కుర్చీలు విసురుకుని , బల్లులు ఎగరేసి పడేసే  వరకు పరిస్థితి వచ్చింది.ఈ నియోజకవర్గంలో జనసేన టిడిపి మధ్య పొత్తుల వ్యవహారం మొదటి నుంచి రెండు పార్టీల నేతలకు నచ్చలేదు.

Advertisement

ఈ నియోజకవర్గ నుంచి పోటీ చేసేందుకు టిడిపి తో పాటు జనసేన సిద్ధమవుతుండడంతో , ఇంతకాలం కష్టపడిన తాము పోటీ చేసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని,  పొత్తులు ఉన్నా,  వేరే పార్టీ వారు ఇక్కడ పోటీ చేసేందుకు తాము ఒప్పుకోమని చెబుతున్న నియోజకవర్గాలు దాదాపు 40 వరకు ఉన్నాయి.

ముఖ్యంగా రాజమండ్రి, పి గన్నవరం, పత్తిపాడు ,నరసాపురం, పిఠాపురం, కాకినాడ, రాజమండ్రి ,ఏలూరు ,భీమిలి, విశాఖ, ఉత్తరం, పెందుర్తి, గాజువాక, అనకాపల్లి ,చిత్తూరు, తిరుపతి , రాజంపేట,  అనంతపురం ,రైల్వేకోడూరు ,శ్రీకాళహస్తి, పుట్టపర్తి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల ఇలా కొన్ని చోట్ల అటు టిడిపి ఇటు జనసేనకు తలనొప్పి తీసుకొచ్చేలాగే కనిపిస్తున్నాయి.ప్రస్తుతం పిఠాపురంలో రెండు పార్టీల నేతల మధ్య జరిగిన వివాదం తెరపైకి వచ్చినా,  అంతర్గతంగా చాలా నియోజకవర్గాల్లో ఇటువంటి సమస్యలు ఉన్నాయి.పిఠాపురం టిడిపి టికెట్ ఆశిస్తున్న అక్కడ ఇన్చార్జి వర్మ పిఠాపురం( Pithapuram ) నియోజకవర్గాన్ని 28000 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్పగా, దీనిపై స్పందించిన పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్చార్జి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్( Tangella Uday Srinivas ) ఈ నియోజకవర్గాన్ని నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ఎందుకు ఓడిపోయారని వర్మను నిలదీశారు.

రాబోయే ఎన్నికల్లో జనసేన గెలుపుకు టిడిపి సాయం చేయాలని శ్రీనివాస్ కోరగా, దీనిపై స్పందించిన వర్మ ఘాటుగానే సమాధానం ఇచ్చారు .

ఓడిపోయింది తాను ఒక్కడినే కాదని , మహామహులు అనుకున్న వాళ్లలో చాలామంది ఓడిపోయారని చెబుతూ,  పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిన విషయంపై సెటైర్లు వేశారు.  దీనిపై జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.టిడిపి కార్యకర్తలు కూడా అంతే స్థాయిలో స్పందించడంతో అక్కడ ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని గందరగోళం సృష్టించారు .ప్రస్తుతం పిఠాపురంలో తెలుగు తమ్ముళ్లు జన సైనికులు మధ్య చోటు చేసుకున్న వివాదం శాంపిల్ మాత్రమేనని,  రాబోయే రోజుల్లో చాలా నియోజకవర్గాల్లో ఇదే రకమైన విభేదాలు తెరపైకి వచ్చేలాగే పరిస్థితి కనిపిస్తోంది.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు