టీడీపీతో టీబీజేపీ.. పొత్తు ఫిక్స్..?

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ శత విధాలా ప్రయత్నిస్తోంది.అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీని ఖతం చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నించింది.

దానికి సీఎం కేసీఆర్ సైతం తన వంతు సాయం చేశారు.మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మూడో ప్లేస్ కు ఫైనల్ చేసేశారు.

ఇప్పుడు ఇక బీజేపీ వర్సెస్ బీఆర్ ఎస్ అనేలా పార్లీలు మారిపోయాయి.ఏదో మునుగోడు పుణ్యమా అని అక్కడ ఓ మోస్తరు ఓట్లు సాధించుకున్నారు.

రాష్ట్ర విడిపోయిన తర్వత 2014లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఉన్న స్థానాలను కోల్పోయింది.దాంతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది.

Advertisement

అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ టీడీపీని పక్కన పెడుతూ వచ్చింది.చంద్రబాబు సైతం తూతూ మంత్రంగా రాష్ట్రానికి వచ్చి పోయేవారు.

తర్వాత కేసీఆర్ తన పార్టీని జాతీయ స్తాయిలో తీసుకుపోయేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టడంతో.టీడీపీ అలెర్ట్ అయింది.

చంద్రబాబు సైతం.కేంద్రం పెద్దలతో సస్సంబంధాలను కొనసాగిస్తుండటం.ఇప్పుడు టీ బీజేపీ నేతల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

ఓ రిసార్ట్ లో మీటింగ్ పెట్టిన బీజేపీ నేతలు పొత్తుల గురించి మాట్లాడుకున్నట్టు ఏకంగా రాములమ్మ క్లారిటీ ఇచ్చింది.ఈ సమావేశంలో, నిజామాబాద్ ఎంపీ అరవింద్, విజయశాంతిలు తరుణ్ చుగ్ తో ఈ విషయాన్ని చర్చించినట్టు తెలుస్తోంది.అయితే.

లైంగిక శ‌క్తిని దెబ్బ‌తీసే ఈ ఆహారాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌!

రాబోయే ఎన్నికల్లో సొంతగానే ప్రజల వద్దకు వెళ్దామని.రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ సముదాయించారని సైతం రాములమ్మ చెప్పింది.

Advertisement

మరి తరుణ్ చుగ్ మాత్రం దీనిపై మాట్లాడలేదని వివరించింది.మరి ఆయన మౌనం వెనుక అరవింద్, విజయశాంతిలు భయపడుతున్నట్టు పొత్తుల భావన ఉందా.? లేక ఇదంతా నేతలు అనుకుంటున్నట్టు ఊహాగానాలేనా తేలాలంటే.మరి కొంత కాలం ఆగాల్సిందే.

తాజా వార్తలు