తారకరత్న కోలుకుంటున్నారు..: బాలకృష్ణ

నటుడు తారకరత్న కుప్పంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి బాలకృష్ణ మాట్లాడారు.

ప్రస్తుతం తారకరత్న కోలుకుంటున్నారని చెప్పారు.సీనియర్ కార్డియాలజిస్టులు తారకరత్నకు వైద్యం అందిస్తున్నారన్నారు.

బీపీ 120 కి పైగా ఉంటోందన్న ఆయన బ్లాక్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారని తెలిపారు.మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తామని బాలయ్య వెల్లడించారు.

నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సొమ్మసిల్లి పడిపోయిన ఆయనను హుటాహుటినా కుప్పం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop

తాజా వార్తలు