బాబాయ్ సినిమాలో అబ్బాయి.. నందమూరి ఫ్యాన్స్‌కు పండగే!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకునేందుకు బోయపాటి అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

బాలయ్యతో కలిసి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టాలనే కసితో బోయపాటి ఈ సినిమా కథను అదిరిపోయే రీతిలో తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాలోని బాలయ్య రైతు పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ టీజర్ రూపంలో రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మరో పాత్రగా అఘోరా లుక్‌లో కనిపించనున్నాడు బాలయ్య.

కాగా బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నందమూరి తారకరత్నను తీసుకునేందుకు బోయపాటి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

యంగ్ ఎమ్మెల్యేగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తారకరత్నను చూపెట్టేందుకు బోయపాటి రెడీ అవుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.మరి ఈ సినిమాలో నటించేందుకు తారకరత్న ఒప్పుకుంటాడా లేడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమాతో సింహా, లెజెండ్ వంటి చిత్రాలను మించిన విజయాన్ని అందుకోవాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

కాగా ఈ సినిమా షూటింగ్‌ను తాజాగా బాలయ్య తిరిగి ప్రారంభించడంతో వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఏదేమైనా బాబాయ్ చిత్రంలో అబ్బాయ్ నటిస్తున్నాడనే వార్తతో నందమూరి ఫ్యాన్స్‌లో అదిరిపోయే క్రేజ్ ఏర్పడింది.

తాజా వార్తలు