జయలలిత మృతిలో సంచలన సీక్రెట్స్ బయట పెట్టిన తమిళనాడు మంత్రి!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ జయలలిత మరణించి ఇప్పటికే రెండేళ్ళ దగ్గర అవుతుంది.

అయితే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించిన జయలలిత మృతి వెనుక చాలా రహస్యాలు దాగి వున్నాయని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆమె మరణం తర్వాత తమిళనాడులో జరిగిన సంఘటనలు కూడా జయలలిత మరణంలో ఏవో సీక్రెట్స్ వున్నాయి అనేదానికి బలం చేకూర్చాయి.ఆమెది సహజ మరణం కాదని, ఆమెని హత్య చేసి చంపేశారని చాలా మంది వాదించారు.

అయితే వాటికి కూడా ఆధారాలు లేవు.ఇదిలా వుంటే తాజాగా తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ నేత, న్యాయశాఖమంత్రి సివి షణ్ముగం సంచలన వాఖ్యలు చేసారు.

జయలలిత మరణం ముమ్మాటికి హత్యే అని అన్న అతను ఆమెకి షుగర్ వుందని తెలిసి హల్వా ఇచ్చి వ్యాధి ముదిరేలా చేసి చంపేశారని వాఖ్యానించారు.దానిని సహజసిద్ధమైన మరణంగా చిత్రీకరించారని ఆరోపించారు.

Advertisement

శశికళని పూర్తిగా విచారిస్తే జయలలిత మరణం వెనుక నిజాలు బయటపడతాయని షణ్ముగం చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు