Karthi facebook account hacked: హీరో కార్తీ ఫేస్ బుక్ హ్యాక్.. అసలేం జరిగిందంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు తమిళ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తమిళ హీరో అయినా కార్తీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

కాగా కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇటీవలే సర్దార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు కార్తీ.

ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే.అంతేకాకుండా ఊహించిన దానికంటే ఎక్కువగానే సక్సెస్ అయ్యింది.

ఇది ఇలా ఉంటే తాజాగా హీరో కార్తీ కి సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.అదేమిటంటే హీరో కార్తీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాకింగ్ కి గురైందట.

Advertisement

ఇదే విషయాన్ని హీరో కార్తీ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ హలో గాయ్స్.

నా ఫేస్బుక్ హ్యాక్ చేయబడింది.మేము ఫేస్బుక్ తో సంప్రదిస్తున్నాము మళ్ళీ అకౌంట్ ని రికవరీ చేస్తాము అని రాసుకొచ్చాడు.

ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కార్తీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో వల్ల వరయ్య మెప్పించిన విషయం తెలిసిందే.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

కాగా మొదటి భాగం అంతా కూడా హీరో కార్తీ చుట్టూనే తిరుగుతుంది.ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హీట్ ను అందుకున్న విషయం తెలిసిందే.అలాగే హీరో కార్తీ ప్రస్తుతం జపాన్ సినిమాలో నటిస్తున్నాడు.

Advertisement

ఇందులో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.రాజు మురుగన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మిస్తోంది.కాగా ఇందులో నటుడు సునీల్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.

తాజా వార్తలు