పెళ్లి పీటలెక్కనున్న నటుడు.. కాబోయే భార్యను పరిచయం చేస్తూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు కోలీవుడ్ యంగ్ హీరో, నటుడు అయిన హరీష్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మొదటి నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన హరీష్ కళ్యాణ్ నేడు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్,బాలీవుడ్ లలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా తన అభిమానులకు హరీష్ కళ్యాణ్ ఒక గుడ్ న్యూస్ ని తెలిపాడు.అదేమిటంటే త్వరలోనే తాను పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు గుడ్ న్యూస్ చెప్పి అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు హరీష్ కళ్యాణ్.

దసరా పండుగ సందర్భంగా తన కాబోయే సతీమణిని పరిచయం చేశారు.సందర్భంగా హరీష్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ట్రీట్ చేస్తూ నటుడిగా నా కెరియర్ ని మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు మీరు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు.

నా మీద ప్రేమాభిమానాలు చూపించి నన్ను ఈ స్థాయికి చేర్చారు.ఇప్పుడు నా జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నాను.

Advertisement

ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.నేను త్వరలోనే నర్మదా ఉదయ్ కుమార్ తో ఏడడుగులు వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాను.

మీ నుంచి మా జంటకు మీ ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను అని హరీష్ కళ్యాణ్ తెలిపారు.అనంతరం ఆమెతో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో హరీష్ కళ్యాణ్ అభిమానులు అతనికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఆ ఫోటోలలో ఒక ఫోటోలో హరీష్ కళ్యాణ్ పక్కన ఆమె నిలబడి అతని వైపు చూస్తూ నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.మరొక ఫోటోలో హరీష్ కళ్యాణ్ నర్మదా కుమార్ చేతులు కలిపి దిగిన ఫోటోని షేర్ చేశారు.

ఆ ఫోటోలలో ఆమె చేతికి మెహిందీ పెట్టుకుని ఉంది.ఎందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు