రచయిత దశ తిరిగింది

ఆయన చాలా సీనియర్ రచయిత, దశాబ్త కాలానికి పైగా సీరియల్లు,సినిమాలు తేడా లేకుండా మంచి కథలు రాస్తూనే ఉన్నారు.అన్ని పేరు తెచ్చినవే .

గట్టిగా చెబితే .ఇప్పుడు ఊపుమీదున్న ఒక హీరో కెరీర్ ని మార్చింది ఆయనే .టాలెంట్ చాలా ఉంది, సక్సెస్ ఉంది, కాని ఎందుకో అగ్ర రచయిత అనే స్థానం దక్కలేదు.కాని ఇప్పుడు ఆయన దశ తిరిగినట్టే అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇటివలే ఒక లైన్ విన్న ఒక టాప్ హీరో, ఈ కథకు ఆ రచయిత అయితేనే బాగుంటుందని, తననే రచయితగా పెట్టుకోవాలని దర్శకుడికి సూచించారట.కథ చర్చలు ఈ మధ్యే మొదలైన ఈ చిత్రం వచ్చే సంవత్సరం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఇది భారి బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.చిన్న హీరోలను స్టార్స్ గా మలిచిన ఆ రచయిత తొలిసారి అంత పెద్ద హీరోతో పనిచేయనున్నాడు.

Advertisement

ఆ సినిమా గనుక హిట్ అయితే ఆయన దశ తిరిగినట్టే .మళ్ళి చిన్న సినిమాల జోలికి వెళ్లనక్కరలేదు.

Pic Talk : Pooja Hegde Makes A Cocktail For Her Dad
Advertisement

తాజా వార్తలు