చనిపోయిన గర్భీణి వైద్యం.. ఎక్కడో కాదు మన ఆమనగల్లులోనే

ఠాగూర్ సినిమాలోని ఓ సీన్ ఇప్పటికీ ఎప్పటికీ పాత బడిపోలేదు.అంతగా గుర్తుండి పోయే సీన్ ఎంటా అని ఆలోచించవద్దు.

అదే హాస్పిటల్ సీన్.ఠాగూర్ సినిమాలో హీరో ఓ ఆస్పత్రి నిజస్వరూపాన్ని బయట పెట్టాలనుకుంటాడు.

చనిపోయిన వ్యక్తి శవాన్ని తీసుకువచ్చి.ఎలాగైన బతికించండి సార్.

ఎంత డబ్బు అయినా పర్లేదు.ఎన్ని కోట్లు అయినా ఓకే అంటాడు.

Advertisement

అప్పుడు ఆ ప్రైవేటు వైద్య సిబ్బంది డబ్బుల కక్కుర్తితో ఆ వ్యక్తి చనిపోయాడని తెలిసినా.వైద్యం చేసి బతికిస్తామని, కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవుతుందని అంటాడు.

చనిపోయిన శవానికి వైద్యం చేసి లక్షలు తీసుకుంటారు ఆ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది.అచ్చంగా అలాంటి ఘటనే జరిగింది తాజాగా.

ఎక్కడో కాదు నల్గొండ జిల్లా ఆమనగల్లులో.ఆమనగల్లు లోని ఓ ప్రైవేటు సిబ్బంది నిర్లక్ష్యానికి గర్భిణీ మృతి చెందింది.ఆ విషయాన్ని బంధువులకు చెప్పకుండా.

పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.హైదరాబాద్ లోని వైద్యులు ఆమెకు చికిత్స చేస్తున్నామని చెప్పారు.

వైయస్సార్ బీమా పథకం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం..!!
వీడియో వైరల్ : అసలు బుద్ది ఉందా లేదా.. రీల్స్ కోసం ఇలా అవసరమా..

తర్వాత పరిస్థితి విషమించి చనిపోయిందని చెప్పారు.వైద్యుల తీరు అనుమానంగా ఉండటంతో బంధువులు గట్టిగా నిలదీసి అడిగారు.

Advertisement

బంధువులు గొడవకు దిగారు.దీంతో ఆమనగల్లు లోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు ఆమె కుటుంబానికి రూ.8 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చు కున్నారు.ఈ మేరకు ఒప్పంద పత్రం కూడా రాసిచ్చారు.

ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

తాజా వార్తలు