హైదరాబాద్‎లో టీ20 కీలక మ్యాచ్.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‎ ఉప్పల్ స్టేడియంలో నేడు టీ20 సిరీస్ కీలక మ్యాచ్ జరగనుంది.భారత్ -ఆస్ట్రేలియా మధ్య రాత్రి 7 గంటలకు క్రికెట్ మ్యాచ్ జరగనుంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‎లో పలు ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.ఉప్పల్ మీదుగా వెళ్లే భారీ వాహనాలకు ఎంట్రీ నిలిపివేశారు.

సాయంత్రం 4 గంటల నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపారు.అదేవిధంగా మ్యాచ్ కు వెళ్లేవారి కోసం 24 పార్కింగ్ స్థలాలతో పాటు వీఐపీల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రూల్ సేవలు అందుబాటులో ఉండనుండగా.ఉప్పల్ కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.

Advertisement

మరోవైపు 2500 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement