తెలంగాణలో ఏఈ పరీక్షపై సస్పెన్స్..!!

టీఎస్పీఎస్సీ సమావేశం నిర్వహించకపోవడంతో ఏఈ పరీక్షపై సస్పెన్స్ కొనసాగుతోంది.ఇవాళ టీఎస్పీఎస్సీ సమావేశంలో ఏఈ పరీక్షపై నిర్ణయం తీసుకుంటామని ఛైర్మన్ తెలిపారు.

అయితే పోలీసుల విచారణ వివరాలు టీఎస్పీఎస్సీ అధికారులకు అందకపోవడంతో సమావేశం జరగలేదని సమాచారం.ఈ నేపథ్యంలో రిపోర్ట్స్ రాకపోవడంతోనే మీటింగ్ పెట్టలేదని అధికారులు చెబుతున్నారు.

పోలీసుల విచారణ అనంతరం టీఎస్పీఎస్సీ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.మరోవైపు ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు