Sushmita Sen : తల్లిగా నువ్వు ఫెయిల్ అయితే అది నా ఫెయిల్యూర్ అంటూ జడ్జ్ చెప్పారు : సుస్మితా సేన్

సుస్మితా సేన్( Sushmita Sen ) 48 ఏళ్ల ఈ అందాల సుందరి 1994 సంవత్సరంలో మిస్ యూనివర్స్ గా ఎంపికై దేశాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.

ఒక బెంగాలీ కుటుంబంలో హైదరాబాదులో పుట్టిన సుస్మితా సేన్ బాలీవుడ్( Bollywood ) లో అడుగు పెట్టింది.

అనేక సినిమాల్లో నటించింది.అయితే తనకు 20 ఏళ్ల వయసున్న టైంలో సుస్మితా సేన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

ఆ నిర్ణయం తన జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందో ఆమె ఒక మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకుంది.సుస్మితా సేన్ ఇప్పటికి వివాహం చేసుకోలేదు కానీ ఇద్దరు ఆడపిల్లలని దత్తత తీసుకుంది.

20 ఏళ్ళ వయసులో తను ఒక ఆడపిల్లను దత్తత తీసుకుంది.ఆ అమ్మాయి పేరు రిని( Renee ) అయితే ఆమె పెళ్లి చేసుకోవడానికి పూర్తిగా అర్హురాలై ఉండి పిల్లలను కలిగే స్థితిలో ఉండి కూడా సుస్మితా తల్లిగా ఉండాలని నిర్ణయాన్ని తప్పు పట్టిన కొందరు ఆమెపై పిటిషన్ వేశారు.దాంతో ఆమె ఈ విషయంపై కోర్టులో ఫైట్ చేయాల్సి వచ్చింది.

Advertisement

దాదాపు ఈ పోరాటం నాలుగేళ్ల పాటు సాగింది.ఆమె తల్లి అవ్వాలనుకుంటున్న విషయంలో ఇబ్బంది లేదు కానీ ఆమె జీవితంపై ఇది ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి తనకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని కోర్టు సుస్మితా తో వివరించగా ఆమె అందుకు అంగీకరించలేదు.

తన పోరాటం పూర్తిగా రినీ కోసమే అంటూ గట్టిగా నిలబడింది.

అలాగే సుస్మితా సేన్ తండ్రితో కూడా సదరు కోర్ట్ జడ్జి మాట్లాడగా ఆమె తండ్రి చెప్పిన విషయాలు కూడా ఎంతోమంది ని కదిలించాయి. నా కూతురు ఒకరి భార్యగా ఉండాలని కోరుకున్నాను.కానీ ఆమె ఒక తల్లిగా ఉండాలనుకుంటుంది.

నాకు ఆమె పూర్తి కుటుంబ జీవితంలోకి వెళ్తేనే సంతోషం.కానీ ఆమె ఏం చేసినా దానికి నా మద్దతు ఉంటుంది అని చెప్పడంతో జడ్జిగారు మరొక మాట ఆలోచించకుండా దత్తత ఇవ్వడానికి స్టాంపు వేశారట.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ఆ స్టాంపు తనకు ఎప్పటికీ గుర్తుంటుందని సుస్మితా తెలిపింది.జడ్జిమేట్ ఇచ్చే రోజు జడ్జి ఈ విధంగా చెప్పారట.

Advertisement

ఈ రోజు నా 38 ఏళ్ల సర్వీస్ లో ఇలాంటి పని ఎప్పుడూ చేయలేదని నువ్వు తల్లిగా నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోతే మనమిద్దరం అందుకు బాధ్యులం అవుతామని సుస్మిత సేన్ కి జడ్జి చెప్పారట.

తాజా వార్తలు