లైవ్ వీడియోలో మాజీ బాయ్ ఫ్రెండ్ తో సుష్మితా సేన్.. కొత్త బాయ్ ఫ్రెండ్ ఎక్కడంటూ?

బాలీవుడ్ నటి మాజీ విశ్వసుందరి అయిన సుష్మితా సేన్ గురించి మనందరికీ తెలిసిందే.గత కొద్ది రోజులుగా సుష్మితా సేన్ పేరు వార్తల్లో మారుమోగిపోతోంది.

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో సుష్మితా సేన్ పేరు కూడా ఉంది అని చెప్పవచ్చు.సుష్మితా సేన్‌ తనతో డేటింగ్‌లో ఉంది అంటూ వ్యాపారవేత్త, ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ లలిత్ మోదీ జులై 14న సాయంత్రం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక అప్పటి నుంచి వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి.

లలిత్‌ తో సుష్మితా డేటింగ్‌ చేయడాన్ని పలువురు విమర్శించగా, ఇంకొంతమంది మాత్రం ఆమెకు మద్దుతుగా మాట్లాతున్నారు.అయితే వారి రిలేషన్ గురించి ఎవరు ఇటువంటి వాక్యాలు చేసినా కూడా సుష్మితా సేన్ కానీ లలిత్ కానీ స్పందించలేదు.కాగా వీరు డేటింగ్‌ చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి వీరిద్దరూ ఏం చేసిన కూడా హాట్‌ టాపిక్‌గా మారుతోంది.

Advertisement

అయితే తాజాగా లలిత్ మోది ఎక్కడా అంటూ సుష్మితా సేన్‌ పై ప్రశ్నల వర్షం కురింపించారు నెటిజన్స్.తాజాగా ఆగస్టు 8న సుష్మితా సేన్‌ తల్లి సుభ్రాసేన్‌ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో లైవ్‌ వీడియోను పోస్ట్‌ చేసింది సుష్మితా సేన్‌.ఈ వీడియోలో సుష్మితా సేన్‌ ఎక్స్‌ బాయ్‌ఫ్రెండ్‌ రోహ్మాన్‌ షా దర్శనమిచ్చాడు.వీడియోలో ఇది చూసిన నెటిజన్లు లలిత్ ఎక్కడ? ఎక్కడ మోది? అంటూ ప్రశ్నించారు.ఈ వీడియోలో రోహ్మాన్‌ షా,సుష్మిత తన కూతుళ్లతో మాట్లాడుతూ కనిపించాడు.

అయితే సుష్మితా సేన్‌ లైవ్‌లో కనిపించమని అందరిని అడిగినప్పుడు రోహ్మాన్‌ షా మాత్రం దూరంగా ఉండటాన్ని వీడియోలో గమనించవచ్చు.కాగా తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్‌ రోహ్మన్‌ షాతో సుష్మితా సేన్‌ మూడేళ్లు డేటింగ్‌ చేసిన విషయం తెలిసిందే.

ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే మొటిమలు దరిదాపుల్లోకి కూడా రావు!
Advertisement