ఎన్నారైలకి సుష్మా స్వరాజ్....భరోసా

కోట్లాది మంది భారతీయులు ప్రపంచ నలుమూలలా ఉన్నారు.ఎంతో మంది గొప్ప గొప్ప స్థానాలలో వారు ఉండే చోట సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు.

అయితే ఇదే సమయంలో ఎదో ఒక చోట భారతీయులు వీసాల విషయంలో కానీ ,లేదా స్థానికుల వలన కానీ ఎదో ఒక రూపంలో ఇబ్బందులని ఎదుర్కుంటూ ఉంటారు అయితే ఆసమయంలో మీరు ఒక్క ట్వీట్ చేస్తే చాలు భారత ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది మీ సమస్యలని పోగొడుతుంది అంటూ కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖా మంత్రు సుష్మా జీ తెలిపారు.

నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం వియాత్నం చేరుకున్న సుష్మా జీ మాట్లాడుతూ.భారత ఎన్నారైలు కష్టాల్లో చిక్కుకుంటే ఒకే ఒక ట్వీట్‌తో సాయం చేస్తున్నామని.రాయబార కార్యలయాలు ప్రాధాన్యత కాదని ప్రవాసుల క్షేమమే మాకు ఎంతో ముఖ్యమని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా.ఏ ఒక్క భారతీయుడు విదేశాలలో ఉంటూ ఇబ్బందులు పడకూడదని అందుకే ప్రతీ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటున్నాం అని తెలిపారు.

Advertisement

ఒక్క ట్వీట్ ద్వారా ఎంతో మంది సమస్యలని పరిష్కరించ్చామని ఆమె తెలిపారు.

ఈ మధ్యకాలంలో వాషింగ్టన్ లో నా పాస్ పోర్ట్ పోగొట్టుకున్నాను దయచేసి నాకు తత్కాల్ ని ఇప్పించగలరు నా పెళ్లి ఆగస్టు నెల రెండవ వారం లో ఉంది కావున ఆ సమయానికి ఇంటికి చేరుకునేలా చేయగలరు అంటూ సుష్మా జీ కి ట్వీట్ చేశాడు ఈ ట్వీట్ కి స్పందించిన ఆమె అతడికి భరోసా ఇచ్చారు పెళ్లి సమయానికి నువ్వు నీ ఊరు చేరుకుంటావు అని అతడికి బదులు ఇచ్చారు.అంతేకాదు నవతేజ్‌ మానవతా దృక్పథంతో అతడికి సాయం చేయండి’ అంటూ అమెరికాలోని ఇండియన్ ఎంబసీ అధికారుల్ని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు