సూర్య స్ట్రైట్ తెలుగు సినిమా ఫిక్స్.. డైరక్టర్ ఎవరంటే..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య డైరెక్ట్ తెలుగు సినిమాకి రంగం సిద్ధమైంది.దశాబ్ధ కాలంగా సూర్య స్ట్రైట్ తెలుగు సినిమాపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

అప్పట్లో త్రివిక్రం తో సూర్య సినిమా అంటూ మీడియా ఒకటే హడావిడి చేసింది.కానీ అది ఇప్పటివరకు కుదరలేదు.

ఆ కాంబో ఫిక్స్ అవుతుందనే నమ్మకం కూడా లేదు.ఇక మరోపక్క సూర్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా ఉంటుందని మొన్నామధ్య డిస్కషన్స్ వచ్చాయి.

బోయపాటి శ్రీను తో సూర్య సింగం లాంటి పవర్ ఫుల్ సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరారు.అయితే బోయపాటి అప్పుడు ఓకే అని చెప్పినా సరే ఆ తర్వాత సూర్యతో సినిమాకు ఆసక్తి చూపించలేదు.

Advertisement

ఇక లేటెస్ట్ గా సూర్య తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న శివ డైరక్షన్ లో తెలుగు సినిమా ఫిక్స్ అయ్యాడట.తెలుగులో శౌర్యం సినిమా చేసిన శివ తమిళంలో అజిత్ తో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

శివ డైరక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో సూర్య సినిమా ఉంటుందని తెలుస్తుంది.ఈ సినిమాని ప్రముఖ నిర్మాతలు యూవి క్రియేషన్స్ నిర్మిస్తారని తెలుస్తుంది.

యూవి క్రియేషన్స్ బ్యానర్ లో సూర్య, శివ కాంబో సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది.

సూర్య ప్రస్తుతం బాల డైరక్షన్ లో అచలుడు సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తి కాగానే శివ డైరక్షన్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.సూర్య తెలుగు సినిమా కోసం తెలుగు ఆడియెన్స్ కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

శివ డైరక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రాబోతుంది.యువి క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ మూవీ ప్లాన్ చేస్తున్నారట.

Advertisement

ఇక ఈ సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ గురించి మరిన్ని డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.

తాజా వార్తలు