మోడీ-చంద్ర‌బాబు-జ‌గ‌న్ ఎవ‌రి స‌ర్వేలో నిజం ఎంత‌

న‌ల్ల ధ‌నం చ‌లామ‌ణికి బ్రేకులు వేయ‌డం, అవినీతిని అరిక‌ట్ట‌డం వంటి రెండు ప్ర‌ధాన అంశాలే ల‌క్ష్యాలుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మోగించిన పెద్ద నోట్ల ర‌ద్దు భేరీ దేశాన్ని కుదిపేసింది.

దాదాపు 33 మందికిపైగా జ‌నాలు బ్యాంకులు, ఏటీఎంల వ‌ద్ద క్యూల‌లో నిల‌బ‌డి ప్రాణాలు కోల్పోయారు.

ఇక‌, చిన్న మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు దెబ్బ‌తిన్నాయి.చేతి వృత్తులు, కూలీలు పూర్తిగా ఇంటికే ప‌రిమితం అయ్యారు.

ఉద్యోగులు కూడా సెల‌వులు మీద సెల‌వులు పెట్టి నోట్లు మార్చుకోవ‌డంలోనే మునిగిపోయారు.ఇంత‌లా దేశాన్ని కుదిపేసిన ఈ పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌ర ప‌రిస్థితుల‌పై ప్ర‌ధాని మోడీ, ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఏపీ విప‌క్ష నేత, వైకాపా అధినేత జ‌గ‌న్‌లు వేర్వేరుగా స‌ర్వేలు నిర్వ‌హించారు.

ఈ స‌ర్వేల్లో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి.మోడీ నిర్వ‌హించిన స‌ర్వేలో 90% మంది ఈ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించ‌గా, కేవ‌లం 10 శాతం మంది మాత్ర‌మే.

Advertisement

ముందుగా చ‌ర్య‌లు తీసుకుని ప్ర‌ణాళికా బ‌ద్ధంగా నిర్ణ‌యం అమ‌లు చేసి ఉంటే బాగుండేద‌ని చెప్పారు.ఇక‌, చంద్ర‌బాబు చేయించిన స‌ర్వేలో 70 శాతం మంది నోట్ల రద్దును సమర్థించారని, 30శాతం మంది నోట్ల రద్దుపై కేంద్ర వ్యవహారశైలి సరిగా లేదని చెప్పారట.

మ‌రోప‌క్క‌, జ‌గ‌న్ స‌ర్వేలో కేవ‌లం 60% మంది మాత్ర‌మే ఈ ర‌ద్దు నిర్ణ‌యాన్ని స్వాగ‌తించారు.మిగతా 40శాతం మంది వ్యతిరేకించ‌డం గ‌మ‌నార్హం.

ఈ క్ర‌మంలో ఆయా స‌ర్వేల‌పై ఇప్పుడు ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రుగుతోంది.ఈ మూడు స‌ర్వేల్లోనూ ఏది క‌రెక్టో తేల్చుకోలేక జ‌నాలు స‌త‌మ‌తం అవుతున్నారు.

దీంతో ఈ స‌ర్వేల్లో ఏది నిజం అనేదానిపై చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజా వార్తలు