నిఘా వ్యవస్థ కేసీఆర్ వలనే దుర్వినియోగం..: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్( BJP MP Lax ) కీలక వ్యాఖ్యలు చేశారు.

హామీల అమలును ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ( Congress )కంటే అత్యధిక ఎంపీ సీట్లను సాధిస్తామని ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.గత ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తోందని మండిపడ్డారు.

రాష్ట్రంలో నిఘా వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశారన్నారు.కేంద్రం అనుమతి లేకుండా గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులకు శిక్షపడే వరకూ పోరాడతామని తెలిపారు.ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
వైరల్ వీడియో : మహిళా పైలట్‌కు ఊహించని అనుభవం.. గాల్లో ఉండగా విమానం పైకప్పు ఓపెన్..

తాజా వార్తలు