తమ్ముడు, చిన్నకూతురు ప్రేమలో పడబోతున్నారా

‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో యూత్‌ ఐకాన్‌గా మారిపోయిన విజయ్‌ దేవరకొండ త్వరలో ‘గీత గోవిందం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రంను ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇక ఆ చిత్రం విడుదల అవ్వడమే ఆలస్యం ‘ట్యాక్సీవాలా’ను రంగంలోకి దించబోతున్నారు.ఇప్పటికే పూర్తి అయ్యి, విడుదలకు రెడీగా ఉన్న ట్యాక్సీవాలాను సెప్టెంబర్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు.

ఇలా వరుసగా చిత్రాలతో దూసుకు పోతున్న విజయ్‌ దేవరకొండ అప్పుడే తన తమ్ముడిని కూడా ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.గత కొన్ని నెలలుగా విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా పరిచయం కాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

దాదాపు ఆరు నెలలుగా నటన మరియు డాన్స్‌లలో శిక్షణ తీసుకుంటున్న ఆనంద్‌ మొదటి సినిమాపై దాదాపుగా క్లారిటీ వచ్చేసింది.ఆనంద్‌ మొదటి సినిమాను సురేష్‌బాబు నిర్మించబోతున్నాడు.

Advertisement

పెళ్లి చూపులు తరహాలో ఒక చిన్న బడ్జెట్‌ చిత్రాన్ని సురేష్‌బాబు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.గతంలో అంతా కొత్తవారితో ‘దొరసాని’ అనే టైటిల్‌తో ఒక చిత్రాన్ని సురేష్‌బాబు నిర్మించబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.

ఆ సినిమాలో కొత్త కుర్రాడిగా ఆనంద్‌ దేవరకొండ నటించబోతున్నాడు.

కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో సురేష్‌బాబు ఈ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించాలని నిర్ణయించారు.ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా రాజశేఖర్‌, జీవితల చిన్న కూతురు శివాత్మికను పరిచయం చేయబోతున్నారు.

ఇటీవలే రాజశేఖర్‌ పెద్ద కూతురు శివాని హీరోయిన్‌గా మొదటి సినిమా ప్రారంభం అయ్యింది.శివాని ‘2 స్టేట్స్‌’ చిత్రం విడుదల కాకుండానే అప్పుడే శివాత్మిక చిత్రం కూడా మొదలు కాబోతుంది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
God Of Coins Player Safety And Responsible Gambling (UK)

ఇద్దరు అక్కాచెల్లెల్లు హీరోయిన్స్‌గా దుమ్ము దులిపేందుకు సిద్దం అవుతున్నారు.విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ, ఇక శివాని రాజశేఖర్‌ చెల్లి శివాత్మిక రాజశేఖర్‌ల కలయికలో ‘దొరసాని’ చిత్రం ప్రారంభంకు అంతా రెడీ అయ్యింది.

Advertisement

ఒక సాదారణ పల్లెటూరి కుర్రాడు అదే గ్రామానికి చెందిన దొరసాని(దొర కూతురు)తో ప్రేమలో పడటం జరుగుతుంది.ఆ ప్రేమ ఎలాంటి మలుపులు తీసుకుని, ఎటు ప్రయాణించింది అనేది సినిమాలో చూపించబోతున్నారు.

దొరసానిగా శివాత్మిక కనిపించబోతుంది.ఈ చిత్రంపై మరింత క్లారిటీ వచ్చే నెలలో రానుంది.