Supreme Court : లంచం కేసులో ప్రజాప్రతినిధులకు మినహాయింపు లేదంటూ సుప్రీం సంచలన తీర్పు

లంచం కేసు( Bribery case )లో ప్రజా ప్రతినిధులకు మినహాయింపు ఇచ్చేది లేదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.

ఈ మేరకు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును ఇచ్చింది.

ప్రజాప్రతినిధులపై ఇచ్చిన ఆరోపణలపై విచారణ జరపాల్సిందేనని సుప్రీంకోర్టు తెలిపింది.ఈ క్రమంలోనే ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక రక్షణ ఉండబోదని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.

ఓటు వేయడానికి, మాట్లాడడానికి ప్రజాప్రతినిధులు లంచం తీసుకోవడాన్ని అరికట్టాలని సుప్రీంకోర్టు( Supreme Court ) సూచించింది.ఈ నేపథ్యంలో 1998 పీవీ నరసింహారావు - జేఎంఎం ( PV Narasimha Rao , JMM )కేసులో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, ఆదివారం 2023
Advertisement