ఐటీ యాక్ట్ సెక్షన్ 66ఏ అమలుపై సుప్రీం ఆగ్రహం

ఐటీ యాక్ట్ సెక్షన్ 66ఏ అమలుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలోనే సెక్షన్ 66ఏను న్యాయస్థానం రద్దు చేసింది.

కానీ ఇప్పటికి ఇంకా కొన్ని రాష్ట్రాల్లో దీని కింద కేసులు నమోదు అవుతున్నాయి.ఈ క్రమంలో యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది.

దీనిలో భాగంగా అన్ని రాష్ట్రాలకు సమాచారం ఇవ్వాలని, రద్దు చేసిన సెక్షన్లపై ఇకపై ఎలాంటి కేసులు నమోదు కాకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్రానికి సూచించింది.ఇప్ప‌టికైనా తీరు మారాల‌ని, దేశంలో ఇక‌పై ఎక్క‌డ కూడా ఈ సెక్ష‌న్‌పై కేసులు న‌మోదు కారాద‌ని కోర్టు చెప్పింది.

అంతేకాకుండా ఈ సెక్ష‌న్ ఆధారంగా న‌మోదైన కేసుల‌ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని చెప్పింది.ఇత‌ర‌త్రా సెక్ష‌న్ల‌తో ఈ సెక్ష‌న్ క‌లిపి న‌మోదు చేసిన కేసుల్లోనూ దీన్ని తొల‌గించాల‌ని కోర్టు సూచించింది.

Advertisement
Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable