సౌత్ ఇండియా నుంచి అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్న మహేష్ బాబు

టాలీవుడ్ లో స్టార్ నెంబర్ వన్ స్టార్ హీరోగా తనకంటూ గుర్తింపు సొంత చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ ఈ మధ్య కాలంలో రొటీన్ కి భిన్నంగా కొత్త కథలని ఎంచుకుంటూ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే భరత్ అనే నేను, తాజాగా మహర్షి సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు సౌత్ హీరోలలో అందరి కంటే అందగాడు అనే విషయం అందరికి తెలిసిందే.

అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా ఉన్న మహేష్ బాబుకి సౌత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మహేశ్‌ బాబు తాజాగా మరో అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

ప్రఖ్యాత టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ ఫరెవర్‌-2018 జాబితాలో మహేశ్‌ బాబుకు స్థానం కల్పించారు.ఇప్పటి వరకు ఈ జాబితాలో సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, ఆమీర్‌ ఖాన్‌ వంటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మాత్రమే ఉన్నారు.

ఇప్పుడు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూడా ఆ లిస్టులో చోటు దక్కించుకున్నారు.ప్రతిసారి మహేష్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ జాబితాలో ఆయన పేరును ఫరెవర్‌ డిజైరబుల్‌ క్లబ్‌లో చేర్చేశారు.

Advertisement

ఇప్పటివరకు ఏ దక్షిణాది హీరోకి ఈ గౌరవం లభించలేదు.మొత్తానికి మహేశ్ బాబు కెరియర్ లో ఇది మరో అరుదైన ఘనత అని చెప్పాలి.

అరటిపండు తినండి .. ఈ రోగాలకు దూరంగా ఉండండి
Advertisement

తాజా వార్తలు