వింట‌ర్‌లో స్కిన్ డార్క్‌గా మారుతుందా? అయితే మీరీ ప్యాక్ వాడాల్సిందే!

వింట‌ర్ సీజ‌న్ రానే వ‌చ్చింది.ఈ సీజ‌న్‌లో ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటుగా చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు సైతం ఎక్కువ‌గానే వేధిస్తూ ఉంటాయి.

ముఖ్యంగా చాలా మంది స్కిన్ డార్క్‌గా మారిపోతుంటుంది.వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, పొడి గాలులు, చ‌ర్మంపై తేమ త‌గ్గి పోవ‌డం, ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో వ‌చ్చే మార్పులు.

ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఈ సీజ‌న్‌లో స్కిన్ టోన్ త‌గ్గి పోతూ ఉంటుంది.దాంతో ఈ స‌మ‌స్య‌ను నివారించుకునేందుకు నానా పాట్లు ప‌డుతుంటారు.

ఏవేవో క్రీములు వాడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ ప్యాక్‌ను ట్రై చేస్తే గ‌నుక చాలా సుల‌భంగా త‌గ్గిపోతున్న స్కిన్ టోన్‌ను పెంచుకోవ‌చ్చు.

Advertisement
Super Pack To Get Rid Of Dark Skin In Winter Season! Super Pack, Dark Skin, Wint

మ‌రి లేటెందుకు ఈ ప్యాక్ ఏంటో.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో.? చూసేయండి.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ కంది ప‌ప్పు, ఒక స్పూన్ శ‌న‌గ‌ప‌ప్పు వేసుకుని లైట్‌గా డ్రై రోస్ట్ చేసి.

ఆపై మెత్త‌గా పిండి చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మిక్సీ ప‌ట్టుకున్న పిండి, అర స్పూన్ క‌స్తూరి ప‌సుపు, అర స్పూన్ పంచ‌దార పొడి, ఒక‌ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడ‌ర్, అర స్పూన్ గులాబీ రేఖ‌ల పొడి, రెండు స్పూన్ల ఆల్మండ్ ఆయిల్‌, నాలుగు స్పూన్ల పెరుగు వేసుకుని ప్యాక్‌లా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికే కాకుండా బాడీ మొత్తానికి ప‌ట్టించి.కాస్త ఆరిన త‌ర్వాత మెల్ల మెల్ల‌గా రుద్దుకుంటూ వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.

Super Pack To Get Rid Of Dark Skin In Winter Season Super Pack, Dark Skin, Wint

ఇలా వారంలో రెండంటే రెండు సార్లు చేశారంటే డార్క్ స్కిన్ క్ర‌మ క్ర‌మంగా తెల్ల‌గా మ‌రియు కాంతి వంతంగా మారుతుంది.పైగా వింట‌ర్ సీజ‌న్‌లో ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల స్కిన్ డ్రై అవ్వ‌కుండా తేమ‌గా, మృదువుగా ఉంటుంది.మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు ఏమైనా ఉన్నా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

హీరో హీరోయిన్స్ గా నటించి అన్నాచెల్లెళ్లుగా చేసిన టాలీవుడ్ యాక్టర్స్
Advertisement

తాజా వార్తలు