వింట‌ర్‌లోనూ స్మూత్ అండ్ సాఫ్ట్ స్కిన్ కావాల‌నుకుంటే ఈ రెమెడీ ట్రై చేయాల్సిందే!

ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న వింట‌ర్ సీజ‌న్‌లో ఆరోగ్య స‌మ‌స్య‌లే కాదు అనేక చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.

వాటి నుంచి త‌ప్పించుకుని స్కిన్‌ను స్మూత్ అండ్ సాఫ్ట్‌గా మార్చుకోవ‌డం అంటే క‌త్తి మీద సామే.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే గ‌నుక చాలా ఈజీగా ముఖ చ‌ర్మాన్ని స్మూత్‌గా, సాఫ్ట్‌గా మ‌రియు గ్లోయింగ్‌గా మార్చుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో.? ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఐదు ఎండు ఖ‌ర్జూరాలు, ఐదు బాదం ప‌ప్పులు వేసి ఒక క‌ప్పు వాట‌ర్ పోసి రాత్రంతా నాన బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత రోజు నీటిని తీసేసి ఖ‌ర్జూరాల్లోని గింజ‌లు, బాదం యొక్క పైపొట్టు తొల‌గించాలి.ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నాన‌బెట్టుకున్న‌ ఖ‌ర్జూరాలు, బాదం ప‌ప్పులు, అర క‌ప్పు ప‌చ్చి పాలు వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

Super Home Remedy To Get Smooth And Soft Skin In Winter Details Smooth And Soft

ఇప్పుడు ఈ మిశ్ర‌మంలో వ‌న్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్‌, రెండు విట‌మిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్‌, అర స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు కావాలీ అనుకుంటే చేతుల‌కు కూడా అప్లై చేసుకుని అర గంట పాటు ఆర‌బెట్టుకోవాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో చ‌ర్మాన్ని స్మూత్‌గా ర‌బ్ చేసుకుంటూ శుభ్రం చేసుకోవాలి.

Advertisement
Super Home Remedy To Get Smooth And Soft Skin In Winter Details! Smooth And Soft

ఇలా చ‌లి కాలంలో రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే.స్మూత్ అండ్ సాఫ్ట్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

పైగా ఈ ప్యాక్‌ను త‌ర‌చూ వేసుకోవ‌డం వ‌ల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొల‌గిపోయి స్కిన్ కాంతి వంతంగా మెరిసిపోతుంది.మ‌రియు స్కిన్ టోన్ సైతం పెరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు