మెగాస్టార్ మాట నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది.. సందీప్ కిషన్ కామెంట్స్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఇండస్ట్రీలో అందరివాడుగా గుర్తింపును సొంతం చేసుకోవడంతో యంగ్ హీరోలకు, మిడిల్ రేంజ్ హీరోలకు తన వంతు సపోర్ట్ అందించే విషయంలో ముందువరసలో ఉంటారు.

సందీప్ కిషన్( Sundeep Kishan ) తాజాగా చిరంజీవి గొప్పదనం గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

ఈ నెల 26వ తేదీన సందీప్ కిషన్ మజాకా సినిమాతో( Mazaka Movie ) ప్రేక్షకుల ముందుకు రానున్నారు.త్రినాథరావు నక్కిన( Trinadharao Nakkina ) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

మజాకా సినిమాతో సందీప్ కిషన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చానని కెరీర్ పరంగా ఎత్తుపల్లాలు చూశానని సందీప్ కిషన్ పేర్కొన్నారు.

ఒక్క అమ్మాయి తప్ప మూవీ ముందు వరకు చాలామంది దర్శకనిర్మాతలు తమ కథలను నాతో పంచుకునే వారని సందీప్ కిషన్ వెల్లడించారు.

Sundeep Kishan Comments Goes Viral In Social Media Details, Sundeep Kishan, Hero
Advertisement
Sundeep Kishan Comments Goes Viral In Social Media Details, Sundeep Kishan, Hero

కథలపై నా జడ్జిమెంట్ రైట్ అని నమ్మేవారని ఆయన పేర్కొన్నారు.కానీ ఒక్క అమ్మాయి తప్ప రిలీజ్ తర్వాత పరిస్థితి మారిపోయిందని ఆయన తెలిపారు.ఒకానొక సమయంలో నా బరువు 97 కిలోలకు చేరిందని నిను వీడని నీడను నేనే సినిమా సక్సెస్ తర్వాత కథల ఎంపికలో జాగ్రత్త వహించానని సందీప్ కిషన్ వెల్లడించారు.

మజాకా షూట్ సమయంలో అనుకోకుండా ఒకరోజు చిరంజీవిని కలిశానని సందీప్ కిషన్ అన్నారు.

Sundeep Kishan Comments Goes Viral In Social Media Details, Sundeep Kishan, Hero

మా మధ్య మంచి అనుబంధం ఉందని సందీప్ పేర్కొన్నారు.మజాకా చేస్తున్నందుకు చిరంజీవి నన్ను మెచ్చుకున్నారని సందీప్ కామెంట్లు చేశారు.మజాకా మూవీ కథ తనకెంతో నచ్చిందని తాను చేయలేకపోయినందుకు బాధ పడ్డానని చిరంజీవి అన్నారని సందీప్ కిషన్ వెల్లడించారు.

విజయ్ కొడుకు డైరెక్షన్ లో నేను సినిమా చేయడం మనం గర్వపడాల్సిన విషయం అని చిరంజీవి అన్నారని సందీప్ కిషన్ వెల్లడించారు.

ప్రెగ్నెన్సీ టైమ్‌లో ములక్కాయ‌ తిన‌కూడ‌ద‌ట‌.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు