దర్శన్ నా కొడుకుతో సమానం.. సోషల్ మీడియాలో సుమలత సంచలన లేఖ వైరల్!

ఆటో డ్రైవర్ రేణుక స్వామి( Renuka Swamy ) హత్య కేసు సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ఇందులో సినిమా సెలబ్రిటీల హస్తం ఉంది అందులో వార్తలు వినిపించడంతో ఈ వార్త కాస్త మరింత వైరల్ గా మారింది.

ఇకపోతే ఈ హత్య కేసులో నిందితులుగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో హీరో దర్శన్‌,( Hero Darshan ) నటి పవిత్ర( Pavithra ) ఉన్న విషయం తెలిసిందే.వీరితో పాటు మొత్తం ఈ కేసులో 17 మంది జైలులో ఉన్నారు.

ఇప్పటికే దర్శన్‌ అరెస్ట్‌ విషయంలో చాలామంది నటీనటులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.

కానీ రాజకీయ నాయకురాలు సినీ నటి సుమలత అంబరీష్( Sumalatha Ambareesh ) స్పందన గురించి చాలామంది ఎదురుచూశారు.ఆమె ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవుతుందో అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.అయితే ఎట్టకేలకు ఆమె ఈ విషయంపై స్పందించారు.

Advertisement

అలాగే దర్శన్‌తో తనకు ఉన్న బంధాన్ని ఆమె వివరించారు.ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ.

నేను 44 ఏళ్ల నుంచి సినిమా రంగంలో నటిగా, కళాకారిణిగా జీవిస్తున్నాను.ఐదేళ్లపాటు ఎంపీగా పని చేసాను.

అనేక రంగాలలో బాధ్యతగా నిర్వర్తించాను.అనవసరంగా వ్యాఖ్యలు చేయడం వేస్ట్‌.

నా కుటుంబంతో దర్శన్ కుటుంబానికి మధ్య ఉన్న బంధం మీకు అర్థం కాదు.అతను స్టార్ కాకముందు 25 ఏళ్లుగా నాకు తెలుసు.స్టార్‌ డమ్‌కి మించి దర్శన్ నాకు కుటుంబ సభ్యుడు, కొడుకు లాంటి వాడు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

అంబరీష్‌ని ఎప్పుడూ నాన్నగా పిలిచే ఆయన జీవితంలో నాకు ప్రత్యేక స్థానం ఇచ్చారు.ఏ తల్లి తన కొడుకుని ఇలాంటి పరిస్థితిలో చూడడానికి ఇష్టపడదు.నాకు తెలిసిన దర్శన్ ఎప్పుడూ ఇలాంటి నేరం చేయడు.

Advertisement

దర్శన్‌లో ప్రేమ, ఉదార ​​హృదయం ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు.ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే సంకల్పం అతని పాత్రకు సాక్ష్యమిస్తున్నాయి.

దర్శన్ అటువంటి నేరం చేసే వ్యక్తి కాదని నేను నమ్ముతున్నాను అని సుమలత తన లేఖలో రాశారు.ఈ విషయం కోర్టులో ఉన్నందున తాను ఇకపై వ్యాఖ్యానించనని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు