సుమ సినిమా అలా చేసి ఉండాల్సింది..!

రెండు దశాబ్ధాలుగా యాంకరింగ్ తో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న సుమ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లో నటించింది.

యాంకర్ గా ఆమె క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే.

అయితే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది సుమ.విజయ్ కుమార్ డైరక్షన్ లో జయమ్మ పంచాయతీ అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది సుమ.శ్రీకాకులం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.సుమ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ సినిమాతో పాటుగా మరో రెండు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి.

అందుకే సుమ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు.అయితే స్టార్ యాంకర్ సుమ చేసిన ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాక పోవడం కూడా షాకింగ్ గానే ఉంది.

ఈ సినిమా మరీ అంత తీసిపారేసేది కాకపోయినా థియేటర్ ఆడియెన్స్ కన్నా ఈ సినిమాని ఓటీటీ రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఓటీటీ లో రిలీజ్ చేసి ఇంకాస్త బాగా ప్రమోట్ చేస్తే ఆడియెన్స్ కి రీచ్ అయ్యేదని అంటున్నారు.

Advertisement

ఏది ఏమైనా సుమ ఇక మీదట ఇలా సినిమాలు చేస్తూ ఉండాలని ఆమె బుల్లితెర ఫ్యాన్స్ కోరుతున్నారు.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!
Advertisement

తాజా వార్తలు