Sukumar : ఆ రోజు దిల్ రాజు నన్ను దారుణంగా తిట్టారు : సుకుమార్

1998లో అంటే సరిగ్గా పాతికేళ్ల క్రితం ఒక టాప్ కాలేజీలో 75 వేల జీతానికి పనిచేస్తున్న మ్యాథ్స్ లెక్చరర్( Maths Lecturer ) అంటే మామూలు విషయం కాదు.

అప్పట్లో అంత సాలరీ సాధారణంగా ఎవరికి రాదు.

అయినా కూడా ఆ వ్యక్తికి ఉన్న టాలెంట్ కొద్ది సదరు కాలేజ్ అంత పే చేస్తుంది.అయినా కూడా ఆ ఉద్యోగం ఎందుకో నచ్చడం లేదు.

సరిగ్గా ఇది జరిగిన ఆరేళ్ల తర్వాత అంటే 2004లో లెక్చరర్ కాస్త ఒక సినిమా డైరెక్టర్ అయ్యాడు.అతడు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆర్య సినిమాతో తన మొట్టమొదటి సినిమాకి దర్శకత్వం వహించి ఘనవిజయాన్ని అందుకున్న ఆ వ్యక్తి దర్శకుడు సుకుమార్( Director Sukumar ).ఆ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ సుకుమార్ కి వచ్చేసింది.ఎవరు ఏం చెప్పినా వినేవాడు కాదు.

Advertisement

తనలో తానే గొప్ప అనే ఫీలింగ్ తో ఉండేవాడు.

అందుకే అప్పుడు టాప్ నిర్మాతగా ఉన్న దిల్ రాజు( Dil Raju )తో ఏదో ఒక విషయంలో గొడవ జరిగింది.ఆయన తన రెండవ సినిమా మహేష్ బాబు లేదా అల్లు అర్జున్ తో తియ్యాలనుకున్నాడు.కానీ దానికి తన నిర్మాత అయిన దిల్ రాజు ఒప్పుకోలేదు.

దాంతో ఎవరికీ చెప్పకుండా హీరో రామ్ కి కథ చెప్పే జగడం సినిమా( Jagadam Movie ) తీయడం ఓకే చేసుకుని తెల్లవారి షూటింగ్ మొదలు పెట్టేసాడు సుకుమార్.ఈ విషయం తెలిసి దిల్ రాజు సుకుమార్ ని బుద్ధుందా నీకు ఎవరైనా ఇలా చేస్తారా కోపం వస్తే చెప్పాలి కానీ చెప్పా చెపు పెట్టకుండా వెళ్లే సినిమా చేసి ఇస్తావా అంటూ తిట్టారట.

నిజానికి చెప్పిన మార్పులకు ఒప్పుకొని ఉండి ఉంటే ఆ సినిమా మహేష్ బాబు లేదా అల్లు అర్జున్ చేస్తే జగడం పెద్ద హిట్ అయ్యేది.రామ్ కేవలం సెకండ్ హీరోగా ఉంటే సరిపోయేది.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?

ఆర్య హిట్ కావడంతో తన జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉండేది అనే భ్రమలో ఉండే వాడినని ఎవరు ఏం చెప్పినా వినాలనిపించేది కాదని, కానీ ఆయన చెప్పిన మాట వినకుండా సినిమా తీసి ఫ్లాప్ రావడంతో తన లో ఉన్న హాయిగా మొత్తం పోయిందని ఆ తర్వాత ఎవరు ఏం చెప్పినా వినడం అలవాటు చేసుకున్నాడని, ఒక బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఒక ఫ్లాప్ రావడంతో తనలోని అప్పటి ఈగోయిస్ట్( Egoist ) చచ్చిపోయాడని సుకుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.కానీ నేను చేసిన తప్పు కేవలం అమాయకత్వంతో చేసిన తప్పు అని ఆరోజు దిల్ రాజు గ్రహించారు కాబట్టే ఈరోజు నేను ఇండస్ట్రీలో ఉండగలిగానని కూడా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు