సూట్‌-బూట్‌ అంగీకారయోగ్యం

ఈమధ్య ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రంగా మాటల దాడి చేస్తున్న కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మోదీది సూట్‌-బూట్‌ పరిపాలన అని విమర్శించిన సంగతి తెలిసిందే.

సూట్‌-బూట్‌ పరిపాలన అంటే కార్పొరేట్లకు ప్రయోజనం కలిగించే పాలన అని, పేదలను, సామాన్యలను పట్టించుకోని పాలన అని రాహుల్‌ విమర్శలోని అర్థం.

రాహుల్‌కు దీటైన జవాబు చెప్పాలని ఇన్నాళ్లూ ఆలోచించిన మోదీ ఈ రోజు కాంగ్రెసుపై తీవ్ర విమర్శలు చేస్తూ సూట్‌-బూట్‌ అంగీకారయోగ్యమేకాని, సూట్‌కేసులు అంగీకారయోగ్యం కాదు అని అన్నారు.సూట్‌కేసులు అంటే కుంభకోణాలు అని అర్థం.

అంటే సూట్-బూట్‌ వేసుకునే తనను ప్రజలు ఆమోదిస్తున్నారని, కుంభకోణాలు చేసిన కాంగ్రెసును ఆమోదించరని మోదీ పరోక్షంగా చెప్పారు.రాజకీయ నాయకుల విమర్శలు గమ్మత్తుగా, సృజనాత్మకంగా ఉంటాయి.

ముఖ్యంగా ఉత్తర భారత రాజకీయ నాయకులు చిత్రమైన పద బంధాలతో, ప్రాసలతో విమర్శలు చేసుకుంటారు.తెలుగు నాయకుల్లో ఇంతటి భావుకత్వం లేదు.

Advertisement

అంతా రొడ్డకొట్టుడే.

గిరిజనులతో సరదాగా డ్యాన్స్ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు

Advertisement

తాజా వార్తలు