ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న గొర్రె పురాణం మూవీ.. ఇక్కడైనా హిట్ గా నిలుస్తుందా?

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ( Young hero Suhas )హీరోగా నటించిన తాజా చిత్రం గొర్రె పురాణం( Gorre Puranam movie ).

బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా గత నెల అనగా సెప్టెంబర్ 20న విడుదలైన విషయం తెలిసిందే.

భారీ ఈ సినిమా విడుదల అయ్యి పరవాలేదు అనిపించుకుంది.ఇక ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడక పోవడంతో ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మూవీ మేకర్స్.

అందులో భాగంగానే ఇప్పుడు ఓటీటీ లో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది.ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే.

గొర్రె పురాణం సినిమాలో ఒక జంతువునే ప్రధాన పాత్ర ధారిగా పెట్టుకుని అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు దర్శకులు.

Advertisement

తాను భిన్నమైన కథలను ఎంచుకుంటానని మరోసారి సుహాస్‌ ఈ చిత్రం ద్వారా నిరూపించాడు.ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది.అయితే ఎప్పుడు స్ట్రీమింగ్‌కు తీసుకొస్తారనేది మాత్రం వెళ్లడించలేదు.

అక్టోబర్‌ 6న ఓటీటీలోకి రావచ్చని టాక్‌ నడుస్తోంది.లేదంటే, అక్టోబర్‌ 11న తప్పకుండా ఓటీటీలో రిలీజ్‌ అవుతుందని సమాచారం.

టైటిల్‌ తగ్గట్టే ఈ సినిమా కథంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది.రఫిక్‌ అనే ఒక ముస్లీం వ్యక్తి బక్రీద్‌ పండగ కోసం ఒక గొర్రెను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాడు.

పండగ రోజు దాన్ని బలి ఇచ్చేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పారిపోతుంది.

ఒక్క లీటర్ కెమికల్స్‌తో 500 లీటర్ల నకిలీ పాలు తయారీ.. వీడియో చూస్తే షాకే..
పుష్ప2 లో బన్నీ ధరించిన దుస్తుల వెనుక అసలు కథ ఇదే.. అక్కడే కొనుగోలు చేశారా?

రఫిక్‌ గ్యాంగ్‌ ( Rafiq Gang )దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా పరుగెత్తి హిందువుల టెంపుల్‌లోకి వెళ్తుంది.ఆ పోచమ్మ తల్లే ఈ గొర్రెను మన దగ్గరకు పంపించింది అని చెప్పి నరహింహా దాన్ని ఆ టెంపుల్‌లోనే బలి ఇవ్వాలని చెబుతాడు.చివరకు ఈ గొర్రె మాదంటే మాది అంటూ రెండు మతాల ప్రజలు గొడవకు దిగుతారు.

Advertisement

ఆ వీడియో కాస్త వైరల్‌ అయి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది.పోలీసులు ఆ గొర్రెను అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలిస్తారు.కోర్టు జడ్జి ఎలాంటి తీర్పు ఇచ్చాడు.

ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ గొర్రె న్యూస్‌ ఇంత వైరల్‌ కావాడానికి గల కారణం ఏంటి? చివరికి ఏం జరిగింది? ఆ గొర్రె ఎవరికీ దక్కింది ఇలాంటి విషయాలు తెలియాలి అంటే సినిమాను చూడాల్సిందే.ఇకపోతే థియేటర్లలో ఆశించిన విధంగా కలెక్షన్స్ ను రాబట్ట లేకపోయినా ఈ సినిమా, ఓటీటీ లో అయినా కలెక్షన్లను రాబడుతుందేమో చూడాలని మరి.

తాజా వార్తలు