పెద్ద డైరెక్టర్ తో సుడిగాలి సుధీర్ సినిమా..?

జబర్దస్తు షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుధీర్( Sudigali Sudheer ) ఒకరు.

ఇప్పుడు ఆయన హీరోగా మారి సినిమాలు కూడా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అందులో భాగాంగానే ఆయన ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా సక్సెస్ కాలేదు.

కానీ రీసెంట్ గా వచ్చిన గాలోడు సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నారు.ఈ సినిమాతో సుధీర్ కి మాస్ హీరో గా కూడా మంచి గుర్తింపు వచ్చింది.

దింతో ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ సుదీర్ తో సినిమా చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అని తెలుస్తుంది.ఈ క్రమంలోనే గాలోడు సినిమా హిట్ తర్వాత ఇప్పుడు సుధీర్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు అనేది తెలుస్తుంది.గతంలో నాగార్జున లాంటి స్టార్ హీరోతో సినిమా చేసిన ఒక ప్రముఖ దర్శకుడు ఇప్పుడు సుడిగాలి సుదీర్ కు కథ వినిపించినట్లు తెలుస్తోంది.

నాగార్జునతో( Nagarjuna ) సంతోషం గ్రీక్ వీరుడు లాంటి సినిమాలు తీసి మంచి గుర్తింపు సంపాదించుకున్నా డైరెక్టర్ దశరథ్( Director Dasharath ).ఆయన ప్రభాస్ తో మిస్టర్ పెర్ఫెక్ట్ లాంటి సూపర్ హిట్ సినిమాని కూడా తెరకెక్కించారు.ఇక ఆ తర్వాత మంచు మనోజ్ తో శౌర్య అనే సినిమా తీశాడు అది ప్లాప్ అయింది అప్పటి నుంచి ఆయన డైరెక్షన్ ఏం చేయకుండా ఖాళీ గానే ఉంటున్నారు.

Advertisement

ఇక ఇప్పుడు ఒక మంచి కథ కుదరడం తో ఆ కథకి సుధీర్ అయితే బాగుంటాడు అని ఆయనతో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.రీసెంట్ గా సుధీర్ కి కథ కూడా వినిపించినట్లు గా తెలుస్తుంది.

సుధీర్ ను ఒక మాస్ కమర్షియల్ హీరోను చేయాలని ఉదేశ్యం తో ఒక మంచి కథను ప్లాన్ చేసుకున్నాడట దశరథ్ ఈ సినిమా హిట్ అవ్వడం దశరథ్ కి ఎంత ముఖ్యమో సుధీర్ కి కూడా అంతే ముఖ్యం.

Advertisement

తాజా వార్తలు