ప్రముఖ నటి పవిత్ర లోకేశ్ సుచేంద్ర ప్రసాద్ తన భర్త కాదని సుచేంద్ర ప్రసాద్ గురించి చెబుతూ బాంబు పేల్చారనే సంగతి తెలిసిందే.
సుచేంద్ర ప్రసాద్ తో తాను విడిపోయానని త్వరలో వీకే నరేష్ ను తాను పెళ్లి చేసుకుంటానని పవిత్రా లోకేశ్ చెప్పుకొచ్చారు.
అయితే పవిత్రా లోకేశ్ వ్యాఖ్యల గురించి నటుడు సుచేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.పవిత్రా లోకేశ్ కాపురాలు కూల్చే వ్యక్తి అని ఆయన అన్నారు.
నిశ్చలంగా ఉండే నీళ్లను కదిలించకూడదని అందంగా ఉండే పువ్వు రేకులను ముళ్లతో నాశనం చేయకూడదని మనల్ని మోసం చేసిన వాళ్ల దగ్గర చెప్పులు కూడా వదలకూడదని సుచేంద్ర ప్రసాద్ కామెంట్లు చేశారు.పవిత్రతో బంధం తొలినాళ్ల నుంచి ఓటమేనని ఆయన తెలిపారు.
లగ్జరీ లైఫ్ ను లీడ్ చేయడం డబ్బులు సంపాదించడం పవిత్ర లక్ష్యమని తాను ఆర్థికంగా గొప్ప స్థితిలో లేకపోవడం వల్లే ఆమె నన్ను వదిలేసిందని సుచేంద్ర ప్రసాద్ అన్నారు.పవిత్ర కొంతమందితో రిలేషన్ లో ఉందని తనకు తెలిసిందని ఆయన తెలిపారు.
ఆ విషయాలను నేను పట్టించుకోలేదని అయితే చివరకు ఆమె నన్ను మోసం చేసిందని సుచేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.నాపై కోపం ఉంటే ఆమె నరేశ్ తో ఉంటూ మరో కాపురంను కూల్చడం కరెక్టా అని ఆయన ప్రశ్నించారు.
పవిత్రకు లైఫ్ లో ఆశలు ఎక్కువని ఆమెది దోచుకునే మనస్తత్వమని ఆయన పేర్కొన్నారు.
డబ్బు చేతికి అందగానే పవిత్ర నరేష్ ను కూడా వదిలేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.ఆమె మనస్తత్వం నాకు బాగా తెలుసని ఆయన తెలిపారు.కష్టపడి పని చేసే గుణం పవిత్రకు లేదని సుచేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
సుచేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy