లెక్చరర్ ను పెళ్లిచేసుకోడానికి ఆ స్టూడెంట్ ఎలాంటి ప్లాన్ వేసిందో తెలుసా.? ఇన్ని ట్విస్టులు సినిమాలో కూడా ఉండవు!

తనను కిడ్నాప్‌ చేశారంటూ ఓ విద్యార్థి పెట్టిన సందేశం (మెసేజ్‌) కడప నగరంలో కలకలం రేపింది.

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఓ యువతి ఆడిన డ్రామాకు తల్లిదండ్రులతో పాటు పోలీసులు పరుగులు పెట్టారు.

తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని.అత్యాచారానికి పాల్పడ్డారని.

చంపేస్తామని బెదిరిస్తున్నారని.అబద్దాలు చెప్పి తల్లిదండ్రులను, పోలీసులను చుక్కలు చూపించింది.

ఇలా ట్విస్టులపై ట్విస్టులు ఇస్తూ.చివరకు ప్రేమించినోడిని పెళ్లి చేసుకొని.

Advertisement

అందరినీ షాక్‌ కు గురిచేసింది ఆ యువతి.ఈ ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాలు ఇలా ఉన్నాయి.

కడప నగర శివారు ల్లోని ఓ ప్రయివేటు డి ఫార్మసీ కళాశాలలో లక్ష్మీ ప్రసన్న(22) డిఫార్మసీ నాలుగో సంవత్సరం చదువుతోంది.ఇదే కళాశాలలో ఆమె అక్క మహాలక్ష్మి కూడా విద్యనభ్యసిస్తోంది.ప్రతి రోజూ ఇద్దరూ కళాశాల బస్సులోనే కళాశాలకు వెళ్లే వారు.

మంగళవారం లక్ష్మీప్రసన్న బస్సు మిస్సయ్యింది.అనంతరం అప్సర సర్కిల్‌లో ఆటో ఎక్కి కళాశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
ఓవరాక్షన్ చేసిన పోలీస్.. ట్రక్ డ్రైవర్‌ ఇచ్చిన ట్విస్ట్‌కి పరార్.. (వీడియో)

తనను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారంటూ లక్ష్మీ ప్రసన్న తన సోదరి మహలక్ష్మికి మెసేజ్‌ చేసింది.ఈ దెబ్బకు షాక్ అయిన ఆమె విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.

Advertisement

వెంటనే తల్లితండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేసారు.పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా చివరికి అసలు విషయం తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు.

కాలేజీ లెక్చర్ సాయి కేశవరెడ్డి, యువతి ప్రేమించుకుంటున్నారు.అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు.

వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు.దీంతో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇక యువతి పెద్ద ప్లానే అల్లింది.మొదట ఓ బుర్ఖా కొనుగోలు చేసింది.

రెండు రోజుల క్రితం బుర్ఖాను బ్యాగులో పెట్టుకొని ఇంటి నుంచి బయటకు వచ్చింది లక్ష్మీ ప్రసన్న.కడపలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలోకి వెళ్లి ప్రసన్న బుర్ఖా ధరించింది.

ఆ తర్వాత సాయి కేశవరెడ్డి వెయిట్ చేస్తున్న ఆళ్లగడ్డకు కడప నుంచి బస్సులో బయల్దేరింది.ఈ సమయంలో తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని.

చంపేస్తామని బెదిరిస్తున్నారని వాట్సాప్‌ లో తల్లిదండ్రులకు మేసేజ్ పెట్టింది.యువతికి తెలివి ఎక్కువే కదా.?.

తాజా వార్తలు