కథ రాసింది ఒక హీరో కోసం.. కానీ చేస్తుంది మరో హీరో.. ఇలా రాబోతున్న సినిమాలు ఇవే?

సాధారణంగా ప్రతి రచయిత లేదా దర్శకుడు ఒక హీరోనీ ఊహించు కొని కథను రాసుకుంటూ ఉంటాడు.

ఆ హీరో అయితే ఆ కథలో సెట్ అవుతాడు అని భావించి ఇక కథ వినిపించడం చేస్తూ ఉంటారు.

కానీ ఇలాంటి కథలు నా ఇమేజ్కి సూటబుల్ కాదు.ఇక ఈ కథ చేస్తే నన్ను ప్రేక్షకులు ఆక్సెప్ట్ చేయలేరు.

అంతా బాగానే ఉంది కానీ కథ ఏదో తక్కువైంది అనిపిస్తుంది.ఇప్పుడు డేట్స్ ఖాళీ లేవు.

ఎప్పుడు వద్దులేండి నెక్స్ట్ టైం చూద్దాం.ఇలాంటి కారణాలు చెప్పి ఎంతో మంది హీరోలు రిజెక్ట్ చేస్తూ ఉంటారు.

Advertisement

ఇలా రిజెక్ట్ చేసిన కథలను మరొకరితో తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతుంటారు ఎంతో మంది దర్శక నిర్మాతలు. ఇలా ఓ హీరో మిస్ చేసుకొని మరో హీరో చేస్తున్న సినిమాల లిస్టు ఇప్పుడు తెలుసుకుందాం బాక్ టు బాక్ సినిమాలను చేస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ.

స్టూవర్టు పురం పోలీస్ ని గడగడలాడించిన దొంగ నాగేశ్వరరావు లైఫ్ స్టోరీ ఆధారంగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాను చేస్తున్నాడు.నిజానికి సినిమా కథ రాసుకుంది మెగాస్టార్ కోసమాట.

నా ఇమేజ్ కు సూట్ కాదని మెగాస్టార్ నో చెప్పడంతో చివరికి రవితేజతో సినిమా చేస్తున్నారు.

వెంకటేష్ చేయాల్సిన మరో సినిమాని రవితేజ చేస్తున్నట్లు తెలుస్తోంది.నక్కిన త్రినాథరావు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ వెంకటేష్కి వినిపించగా వెంకటేష్ మాత్రం నో చెప్పేశాడట.అయితే ఈ సినిమాని మాస్ మహారాజా తో ధమాకా అనే టైటిల్ తో చేస్తున్నాడు నక్కిన శ్రీనాథ రావు.

Lorem Ipsum Dolor Sit Amet
Lorem Ipsum Dolor Sit Amet

ఇక ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేస్తున్న జనగణమన సినిమా కూడా అలాంటిదే.

Advertisement

పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన మహేష్బాబుతో చేయాలని అనుకున్నాడు.కానీ వీరిద్దరి మధ్య క్లాషెష్ వచ్చాయి.దీంతో ఇక ఈ సినిమాని దేవరకొండ తో సినిమా చేసేందుకు సిద్ధం అయిపోయాడు పూరి జగన్నాథ్.

ఈ లిస్టులో పుష్ప కూడా ఉంది మహేష్ బాబుతో సినిమా తీయాలని అనుకున్నాడు సుకుమార్.ఈ సినిమాలో క్యారెక్టర్ తనకు సెట్ కాదని ప్రేక్షకులు ఆక్సెప్ట్ చెయ్యరు అని మహేష్ నో చెప్పడంతో చివరకు అల్లు అర్జున్ తో సినిమా తీయడానికి రెడీ అయ్యాడట.కేవలం హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా రిప్లేస్ అవుతున్నారు.

సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ కాంబినేషన్లో సినిమాలో పరిణితి చోప్రాను అనుకున్నారు.కానీ ఇప్పుడు మాత్రం రష్మిక సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

నాగార్జున ప్రవీణ్ సత్తారు ఘోస్ట్ సినిమాలో ముందుగా కాజల్ అనుకున్నప్పటికీ ప్రభుత్వం సోనాల్ చౌహాన్ ని ఫిక్స్ చేశారు.