మిగులు ఉద్యోగులు పేరుతో బదిలీ లు నిలిపి వేయండి - ఆర్టీసి ఆర్ఏం కి ఏస్ డబ్ల్యు ఎఫ్ వినతి పత్రం

ఎక్సెస్ పేరుతో ఖమ్మం ఆర్టీసి రీజియన్ లో డ్రైవర్లు ను ఇతర జిల్లాల కు బదిలీ చేస్తున్న ప్రక్రియ నిలిపి వేయాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్వర్యంలో గురువారం ఖమ్మం ఆర్టీసి రీజియన్ మేనేజర్ కి వినతి పత్రం అంద చేశారు.

వినతి లోని వివరాలు ప్రకారం.

మోస్టు జూనియర్ డ్రైవర్స్ను ఆదిలాబాద్, నిజామాబాద్ రీజియన్లకు మరియు మధిర, భద్రాచలం డిపోలకు చేసిన బదిలీలను చేస్తున్నారు.ఖమ్మం రీజియన్లో గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లను అకస్మాత్తుగా 64.మంది డ్రైవర్లను ఆదిలాబాద్, నిజామాబాద్ రీజియన్లకు, మరో 64 మొత్తం 128 మంది డ్రైవర్లను రీజియన్లోని ఖమ్మం, కొత్తగూడెం, మణుగూర్, సత్తుపల్లి డిపోల నుండి మధిర మరియు భద్రాచలం డిపోలకు బదిలీలు చేసినారు.ఇలాంటి బదిలీల వల్ల కార్మికుల్లో అలజడి, తీవ్ర అసంతృప్తి నెలకొని వుంది.2021 అక్టోబర్ నెలలో 601 షెడ్యూల్స్ వుండగా 2022 అక్టోబర్ నాటికి 494 షెడ్యూల్స్ ప్రస్తుతము నడుస్తున్నవి.సుమారు 107 షెడ్యూల్స్ తగ్గినవి.

Stop Transfers In The Name Of Surplus Employees - ASWF Petition To RTC RM , Tran

సిబ్బంది మిగులు తేలడానికి ఇదే ప్రధాన కారణం అయింది.దీని వల్ల అన్ని కేటగిరిల పైన ఈ ప్రభావం పడింది.

ఖమ్మం రీజియన్లో ప్రయాణికుల అవసరాల మేరకు బన్లు పెంచాల్సిన అవసరం ఎంతైనా వుంది, ప్రజల నుండి దూర ప్రాంత సర్వీసుల కొరకు అనేక విజ్ఞప్తులు వస్తున్నవి.ఖమ్మం రీజియన్ ప్రక్కన వున్న ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో వున్నది.

Advertisement

ఇక్కడ నుండి అంతరాష్ట్ర సర్వీసులు రాజమండ్రి, విశాఖపట్నం విజయవాడ మరియు తిరుపతి సర్వీసులకు విపరీతమైన డిమాండ్ వుంది.అంత రాష్ట్ర సర్వీసులకు సమాంతరంగా నడపాల్సిన మనం డిమాండ్ వున్నప్పటికీ నడపం లేదు.

గ్రామీణ ప్రాంత సర్వీసులు బాగా తగ్గాయి.దీని వల్ల రీజియన్ అనేక ప్రాంతాల్లో ఇల్లిసిట్ ఆపరేషన్ బాగా పెరిగి ఆర్టీసి ఆదాయం తగ్గింది, EX: ఖమ్మం - ఇల్లందు, బోనకల్, కోదాడ, కొత్తగూడెం - ఇల్లందు, మధిర - విజయవాడ.తగ్గించిన షెడ్యూల్స్ వెంటనే పునఃసమీక్షించి షెడ్యూల్స్ పెంచి ఇతర రీజియన్లకు బదిలీ చేసిన డ్రైవర్లను మరియు మధిర, భద్రాచలం డిపోలకు చేసిన బదిలీలను వెంటనే నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు .

Advertisement

తాజా వార్తలు