మొబైల్ ని చార్జింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈరోజుల్లో మొబైల్ ఫోన్ కూడా ఆస్తితో సమానం.వేలల్లో ఖర్చుపెట్టి కొంటున్నాం కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.

మొబైల్ బ్యాటరీని సరిగా కాపాడుకుంటే, మొబైల్ చాలావరకు సురక్షితంగా ఉన్నట్లే.ఈ మధ్య ఇన్ బిల్ట్ బ్యాటరితో వచ్చే మొబైల్స్ ఎక్కువైపోయాయి.

ఇలాంటి మొబైల్స్ వాడుతున్నవారు బ్యాటరిని పాడుచేసుకుంటే ఇక మొబైల్ ఫోన్ ని పక్కనపెట్టాల్సిందే.అందుకే బ్యాటరీని చార్జ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.

* మొదటగా, మొబైల్ లో బ్యాటరి పూర్తిగా అయిపోయేంతవరకు వాడొద్దు.జీరో నుంచి 100% చార్జింగ్ పెట్టె అలవాటు మానుకోవాలి.

Advertisement

ఫోన్ బ్యాటరి 20%-30% లో ఉండగానే చార్జింగ్ లో పెట్టండి.లేదంటే బ్యాటరి లైఫ్ దెబ్బతింటుంది.

* మెటాలిక్ బాడితో వచ్చే మొబైల్స్ చార్జింగ్ పెట్టినప్పుడు బాగా హీట్ అవుతాయి.మెటాలిక్ బాడి ఉన్నా లేకున్నా, ఫోన్ టెంపరేచర్ కూల్ గా ఉన్నప్పుడే చార్జింగ్ లో పెట్టండి.

* చార్జింగ్ లో ఉండగా ఎలాంటి టాస్కింగ్ వద్దు.ముఖ్యంగా మీడియా ఫైల్స్ అస్సలు ప్లే చేయవద్దు.

* సాద్యమైనంతవరకు, మీ మొబైల్ యొక్క బ్యాటరి చార్జర్ ని మాత్రమే వాడండి.మార్కెట్లో దొరికే ఇతర చార్జర్స్ పై ఆధారపడవద్దు.

సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అయిన స్టార్స్ ఎవరో తెలుసా..?

* బ్యాటరీ ఫుల్ అయిన తరువాత కూడా, మొబైల్ ని చార్జ్ లోనే ఉంచడం వద్దు.అలా చేసినా ప్రాబ్లెం లేదని కొన్ని బ్యాటరి కంపెనీలు వాదిస్తున్నా, రిస్క్ తీసుకోవడం ఎందుకు.

Advertisement

* చివరది చెప్పాల్సిన పని లేదు.చార్జింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ కాల్స్ అటెండ్ చేయవద్దు.

తాజా వార్తలు