ఈ స్టీల్ బర్డ్ హెల్మెట్ తో ఎండకు చెక్ పెట్టెయ్యండి.. దీని ప్రత్యేకత ఏమిటంటే..?

వేసవికాలంలో బైక్ లపై, స్కూటీలపై ప్రయాణించే వారికోసం ప్రముఖ హెల్మెట్ తయారీ కంపెనీ స్టీల్ బర్డ్ ( Steelbird )సరికొత్త ఫీచర్ తో హెల్మెట్ ను విడుదల చేసింది.

దీని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఎయిర్ ఫ్లో వెంటిలేషన్ సిస్టం అమర్చబడి ఉంది.

దీనిని ధరించి ప్రయాణిస్తున్నప్పుడు తలకు చెమట పట్టకుండా హెల్మెట్ లోపల ఎయిర్ ఫ్లో తో చల్లటి గాలి వస్తు చెమట పట్టకుండా చేస్తుంది.ఈ హెల్మెట్ BIS సర్టిఫైడ్ పొందింది.

SBA 19 R2K హెల్మెట్( SteelbirdSBA 19 R2K Helmet ) మొత్తం థర్మో ప్లాస్టిక్ తో తయారు చేయబడింది.కాబట్టి దీనిని ధరించి ప్రయాణిస్తే ఏ పరిస్థితుల్లోనైనా రక్షణ కల్పిస్తుంది.హెల్మెట్ లోపల ఉండే భాగం మార్చుకోవడానికి కూడా వీలు ఉంటుంది.

హెల్మెట్ రైడింగ్ చేసే వారికి చాలా సౌకర్యవంతంగా తయారు చేయబడింది.దీనిని అధిక సాంద్రత EPS ను కలిగి ఉండేలా తయారు చేశారు.

Advertisement

ఈ హెల్మెట్ ప్రభావం- నిరోధకతను కలిగి ఉంటుంది. Visor ఒక పాలి కార్బోనేట్ యాంటీ స్క్రాచ్ కోటింగ్ తో తయారు చేయబడింది.

దీనిని ధరించి డ్రైవ్ చేస్తే స్పష్టమైన దృష్టిని అందిస్తుంది.

ఈ ప్లిప్ - అప్ హెల్మెట్ ధర రూ.1,199 మాత్రమే.కంపెనీ అధికారిక స్టోర్ నుండి ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు.

ఈ ప్లిప్ - అప్ హెల్మెట్ 3 పరిమాణాలలో అందుబాటులో ఉంది.ఎక్స్ ట్రా లార్జ్ 620 mm, లార్జ్ 600 mm, మీడియం 580 mm లాంటి సైజులలో అందుబాటులో ఉంది.

కేంద్రం కీలక నిర్ణయం..బంగారం,వెండిపై సుంకాలు డబుల్
రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు : రాష్ట్ర మంత్రులు

ఇక కావలసిన రంగులలో ఉండడంతో బైక్ పై ప్రయాణించేవారు కంపెనీ అధికారిక స్టోర్ నుండి పొందవచ్చు.

Advertisement

కంపెనీ వేసవికాలంలో బైక్లపై, స్కూటీలపై ప్రయాణించే మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా తయారు చేసింది.దీనిని ధరించి ప్రయాణిస్తే చాలావరకు వేసవి ఎండ నుండి ఉపశమనం కలిగిస్తుందని కంపెనీ తెలిపింది.

తాజా వార్తలు