అమ్మో అంత పెద్ద గ్లాసు.. కడుపులోకి ఎలా వెళ్లిందబ్బా, వైద్యులే షాక్!

ఉత్తర ప్రదేశ్ జౌన్ పుర్ లో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు.

కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి కడుపులోంచి పెద్ద స్టీల్ గ్లాసును బయటకు తీశారు.

అసలు అంత పెద్ద గ్లాసు కడుపులోకి ఎలా వెళ్లిందో తెలియక జుట్టు పీక్కుంటున్నారు.రోగితో పాటు ఆయన భార్యను ప్రశ్నించిననా గ్లాసు కడుపులోకి ఎలా వెళ్లిందో తెలియదని చెప్తోంది.

అసలేం జరిగింది, కడుపులోకి అంత పెద్ద గ్లాసు ఎలా వెళ్లి ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.జౌన్ పుర్ జిల్లాలోని గోత్వా భటౌలీ గ్రామానికి చెందిన సమరనాథ్.

కొన్ని రోజుల నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు.చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడు లాల్ బహదూర్ వద్దకు వెళ్లాడు.

Advertisement

ఎక్స్ రే తీసిన వైద్యుడు కడుపులో గ్లాసు లాంటి ఆకారాన్ని గుర్తించాడు.సుమారు గంట పాలు వైద్య బృందం శ్రమించి సమరనాథ్ కడుపులోంచి స్టీలు గ్లాసును బయటకు తీశారు.

రోగి కడుపులోకి స్టీల్ గ్లాసు ఎలా చేసిందిని రోగి భార్య మనోరమను అడగ్గా.అతడికి హెర్నియా ఉందని తెలిపింది.

అయితే రోగి మాత్రం నోటి నుంచే గ్లాసు కడుపులోకి వెళ్లిందని చెప్తున్నాడు.వైద్యులు మాత్రం రోగి చెప్పేది అబద్ధం అని అంటున్నారు.

నోటి ద్వారా గ్లాసు కడుపులోకి వెళ్లే అవకాశం లేదని చెబుతున్నారు.స్టీలు గ్లాసు కచ్చితంగా మలద్వారం నుంచే కపుడులోకి వెళ్లిందని వివరిస్తున్నారు.

పెసలతో ఆ సమస్యలన్నీ హాంఫట్.. మరి వారానికి ఒక్కసారైనా వాటిని తింటున్నారా?

కానీ ఈ గ్లాసు వల్ల చాలానే కడుపు నొప్పిని భరించాడని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు