విశాఖ పెందుర్తి నియోజక వర్గంలో పర్యటించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని

ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలు తాత్కాలిక ప్రాధమిక ఔట్ పేషెంట్ విభాగాలను పరిశీలించిన రాష్ట్ర మంత్రి విడుదల రజని.

ఈ సందర్భంగా మంత్రి విడుదల రజని మాట్లాడుతూ.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ రూపురేఖలు మార్చారు.మంచి ఆలోచనలు, ముందు చూపుతో ఉన్న నాయకుడు జగన్ అన్న.

వైద్యులు, ఆరోగ్య పరికరాలు లేని అనేక ఆసుపత్రులు రాష్ట్రంలో మనం చూసాం.ఈ రోజు నాడు, నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను వాటి రూపురేఖలు మార్చి, వైద్యులను ఏర్పాటుచేసి, ఆధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేస్తున్నాం.

రాష్ట్రంలో 16 వేళా కోట్ల రూపాయలకు పైగా నాడు, నేడు క్రింద వైద్యానికి ఖర్చు చేస్తున్నాం.రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 47 వేళకు పైగా వైద్యులను, సిబ్బందిని నియమించిన ఘనత వై.

Advertisement

సి.పి.ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసాం.మంత్రి విడుదల రజని.

ప్రభుత్వ డాక్టర్లు, గ్రామాలకు వెళ్లి వాళ్ళ ఇంటి వద్దే వైద్యం చేసి మందులు ఇచ్చే పరిస్థితిని తీసుకువస్తున్నాం.నాణ్యమయిన, మెరుగయిన వైద్య సేవను అందించడమే ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి లక్ష్యం.

ప్రతి హెల్త్ సెంటర్ వద్ద, ప్రతి నెల ఒక మెగా మెడికల్ క్యాంపు కూడా వెడుతున్నాం.గతంలో ఎప్పుడయినా ఇంతమార్పు చూసామా.

అన్న ఆలోచన కలుగుతోంది.చంద్రబాబు హయాంలో ఏ ఒక్క రంగాన్ని పట్టించుకోలేదు.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

ఇక్కడ 5 డాక్టర్ లు కూడా లేని ఈ పెందుర్తి సి.హెచ్.సి.లో ఈ రోజు 15 మంది డాక్టర్లను నియమించాం.నేను ఇది చేసాను, అది చేసాను అని చెప్పుకునే దమ్ము చంద్రబాబుకు లేదు.

Advertisement

ఎందుకంటే ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి చెయ్యలేదుకనుక.

తాజా వార్తలు