Priyamani : స్టార్ హీరోయిన్ ప్రియమణి నెల ఖర్చులు అంత తక్కువా.. ఈ హీరోయిన్ రియల్లీ గ్రేట్ అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియమణి( Priyamani ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న ప్రియమణి.

మొదట ఎవరే అతగాడు సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ప్రియమణి ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలలో కూడా నటించింది.

అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే డ్యాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇకపోతే ఇటీవలె సెకండ్ ఇన్నింగ్స్‏ ప్రారంభించిన ప్రియమణి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ప్రియమణి.

ఇటు ఓటీటీలోనూ వెబ్ సిరీస్ చేస్తుంది.ది ఫ్యామిలీ మ్యాన్( The Family Man ) వెబ్ సిరీస్ సక్సెస్ తర్వాత ఆమెకు హిందీలో వరుస అవకాశాలు వస్తున్నాయి.

Advertisement

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లో సినిమా, వెబ్ సిరీస్ చేస్తూ తీరిక లేకుండా గడిపేస్తుంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.

హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది ప్రియమణి.ఇది ఇలా ఉంటే తాజాగా ప్రియమణికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అదేంటంటే హీరోయిన్ ప్రియమణి నెలకు అయ్యే ఖర్చు( Priyamani Monthly Expenses ) ఎంత అన్న విషయంపై వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

మామూలుగా హీరో హీరోయిన్లు అనగానే లక్షలు విలువ చేసే కార్లు, బట్టలు ఇలా ఎన్నెన్నో కలిపి నెలకు లక్షల్లో ఖర్చు చేస్తూ ఉంటారు.

కానీ హీరోయిన్ ప్రియమణి మాత్రం ఎందుకు పూర్తిగా విరుద్ధం.ఎందుకంటే ప్రియమణి కేవలం నెలకు 10000 మాత్రమే ఖర్చు చేస్తుందట.అది కూడా తనకు అవసరం అయితే తప్ప.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

కొన్ని కొన్ని సార్లు పదివేల కంటే తక్కువ ఖర్చు చేస్తుందట హీరోయిన్ ప్రియమణి. కరోనా మహమ్మారి తర్వాత ఆమె ఇలా పొదుపు చేయడం మొదలు పెట్టిందట.

Advertisement

ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది హీరోయిన్ ప్రియమణి.

తాజా వార్తలు