ఐదేళ్లలో ఐదు రెట్లు పెరిగిన బాలయ్య రెమ్యునరేషన్.. ఆ సినిమాకు ఎంతంటే?

స్టార్ హీరో బాలయ్యకు( Balayya ) శుక్ర మహార్దశ నడుస్తోందని ఆయన నటించిన ప్రతి సినిమా హిట్టేనని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

అఖండ( Akhanda ) సినిమాకు ముందు బాలయ్య నటించిన సినిమాలలో మెజార్టీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

అయితే అఖండ సినిమాతో మాత్రం బాలయ్య జాతకం మారిపోయింది.వీరసింహారెడ్డి( Veerasimha Reddy ) మూవీకి బాలయ్యకు 12 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా దక్కింది.భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమాకు బాలయ్య పారితోషికం 18 కోట్ల రూపాయలు కాగా డాకు మహారాజ్( Daaku Maharaaj ) మూవీకి 27 కోట్ల రూపాయలు అని భోగట్టా.అఖండ2( Akhanda 2 ) సినిమాకు బాలయ్య రెమ్యునరేషన్ 35 కోట్ల రూపాయలు కాగా గోపీచంద్ మలినేని సినిమాకు బాలయ్య పారితోషికం 40 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.ఐదేళ్లలో బాలయ్య పారితోషికం 5 రెట్లు పెరిగిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సీనియర్ హీరోలలో చిరంజీవి మినహా మరెవరూ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోవడం లేదు.డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద 130 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను అందుకున్నారని సమాచారం అందుతోంది.బాలయ్య తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

బాలయ్య క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పెరుగుతోంది.

Advertisement

బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరిన్ని సంచలన విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.బాలయ్య పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకుంటే ఈ హీరో రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.

బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద క్రేజ్ పెంచుకుంటున్నారు.బాలయ్య తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.స్టార్ హీరో బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు