ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఫ్లాపైతే అలా చేస్తాను.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్!

దర్శకధీరుడు రాజమౌళి సినీ కేరీర్ లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు.

ప్రతి సినిమాకు రాజమౌళి మొదటి సినిమాకు ఏ విధంగా కష్టపడతారో అదే విధంగా కష్టపడటంతో ప్రతి సినిమా ఊహించని విధంగా సక్సెస్ సాధిస్తోంది.

అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్ లో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఫ్లాప్ అయితే ఏం చేస్తారనే ప్రశ్న రాజమౌళికి ఎదురైంది.ఆ ప్రశ్నకు జక్కన్న సమాధానం ఇస్తూ అమంగళం ప్రతి గతం అవు గాక అని అన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ ఫ్లాప్ అయితే నిజంగా ఏం చేస్తానో తెలియదని అలా జరిగితే డిప్రెషన్ లోకి వెళ్లిపోతానని జక్కన్న పేర్కొన్నారు.సక్సెస్ కంటే ఫెయిల్యూర్ లో ఎక్కువగా నేర్చుకుంటామని ఫెయిల్యూర్ వస్తే మరింత ఎక్కువగా నేర్చుకోవచ్చని జక్కన్న చెప్పుకొచ్చారు.

సక్సెస్ కోసం ఆ తర్వాత మరింత ఎక్కువగా తాను కష్టపడతానని రాజమౌళి కామెంట్లు చేశారు.సినిమా తీసిన సమయంలో ప్రేక్షకులకు నచ్చుతుంది అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంటుందని రాజమౌళి పేర్కొన్నారు.

Star Director Rajamouli Shocking Comments About Rrr Movie Result, Rajamouli , S
Advertisement
Star Director Rajamouli Shocking Comments About Rrr Movie Result, Rajamouli , S

మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా పడే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది.ఆర్‌ఆర్‌ఆర్‌ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరగగా ఇండస్ట్రీ వర్గాల వాళ్లు సైతం ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించడం ఖాయమని నమ్ముతున్నారు.ఆర్‌ఆర్‌ఆర్‌ అంచనాలకు మించి విజయం అందుకుంటుందేమో చూడాలి.

Star Director Rajamouli Shocking Comments About Rrr Movie Result, Rajamouli , S

నిర్మాత దానయ్య ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. అమెరికాలోని ప్రీమియర్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమాకు ఏకంగా ఒక మిలియన్ డాలర్ కలెక్షన్లు వచ్చాయి.ఎన్టీఆర్, రామ్ చరణ్ మూడేళ్ల కష్టానికి ఆర్‌ఆర్‌ఆర్‌ రూపంలో ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.

రాజమౌళి ఈ సినిమా ఫలితం విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు