పెళ్లి సందడి రీమేక్ ? శ్రీకాంత్ కొడుకుతో !

శ్రీకాంత్ కొడుకు రోషన్ కథానాయకుడిగా నిర్మలా కాన్వెంట్ సినిమా రూపొందుతోంది.అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో, నాగార్జున ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.

చాలావరకూ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను, సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో వున్నారు.ఇదిలా వుండగా, రోషన్ హీరోగా పెళ్లి సందడి సినిమా మరోమారు తెరకెక్కనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.

శ్రీకాంత్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా పెళ్లి సందడి నిలిచింది.మ్యూజికల్ హిట్ అనిపించుకోవడమే కాకుండా, శ్రీకాంత్ కెరియర్ స్పీడ్ ను పెంచింది.

అలాంటి ఆ సినిమాను రోషన్ తో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.రోషన్ రెండవ సినిమాగా గానీ .మూడవ సినిమాగా గాని, ఈ రీమేక్ వుండే అవకాశం వుందని అంటున్నారు.అదే నిజమైతే .ఇది మంచి ప్రయత్నమే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
మలయాళం సినిమా రీమేక్ అంటే హిట్ కొట్టినట్టేనా ? తెలుగు లో రైటర్స్ ఎక్కడ ..?

తాజా వార్తలు