ఆ సినిమా తర్వాత వరుసగా 25 ఫ్లాపులు.. అలాంటి పరిస్థితి.. శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఎప్పుడు వస్తుందో ఫ్లాప్ ఎప్పుడు వస్తుందో ఎవ్వరూ చెప్పలేరనే సంగతి తెలిసిందే.

ఎంతో టాలెంట్ ఉంటే మాత్రమే ఈ ఇండస్ట్రీలో సక్సెస్ కావడం, దీర్ఘకాలంలో కెరీర్ ను కొనసాగించడం సాధ్యమవుతుంది.

శ్రీకాంత్( Srikanth ) తాజాగా కోటబొమ్మాళి పీఎస్ సినిమాతో( Kotabommali PS ) మరో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.మహాత్మ సినిమా తర్వాత 25 ఫ్లాపులు వచ్చాయని శ్రీకాంత్ కామెంట్లు చేశారు.

ఒకప్పుడు స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన శ్రీకాంత్ తన కెరీర్ గ్రాఫ్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఆమె సినిమా హిట్టైందని ఆ సమయానికే తాజ్ మహల్, పెళ్లిసందడి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని శ్రీకాంత్ పేర్కొన్నారు.

ఆహ్వానం, వినోదం సినిమాలు సైతం సక్సెస్ సాధించాయని ఆయన కామెంట్లు చేశారు.మహాత్మ సినిమా తర్వాత నాకు కెరీర్ పరంగా దెబ్బ పడిందని చెప్పుకొచ్చారు.

Advertisement

మహాత్మ మూవీ( Mahathma Movie ) నా వందో సినిమా అని శ్రీకాంత్ అన్నారు.ఆ సినిమా తర్వాత నా కెరీర్ నెమ్మదిగా పడిపోయిందని ఆయన చెప్పుకొచ్చారు.మహాత్మ తర్వాత ఒక పాతిక సినిమాలు చేశానని శ్రీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మహాత్మ తర్వాత పాతిక సినిమాలు చేయగా ఆ సినిమాలు సక్సెస్ సాధించలేదని శ్రీకాంత్ పేర్కొన్నారు.టైం బ్యాడ్ వల్ల అలా జరిగిందని ఆయన కామెంట్లు చేశారు.

కొత్తవాళ్లు ఇండస్ట్రీకి రావడం అందుకు ఒక కారణం రావచ్చని శ్రీకాంత్ వెల్లడించారు.శ్రీకాంత్ ప్రస్తుతం దేవర సినిమాతో( Devara Movie ) పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది.ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

శ్రీకాంత్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.శ్రీకాంత్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు