Sridevi : శ్రీదేవి తల్లి తన పిల్లల విషయంలో ఇలా ప్రవర్తించిందా?

ఏ తల్లి అయినా తన కూతురు బాగుండాలని కోరుకుంటుంది.అలాగే వయసు వచ్చాక చక్కగా పెళ్లి చేసుకుని భర్త పిల్లలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది.

కానీ ఈ విషయంలో అతిలోకసుందరి శ్రీదేవి( Sridevi ) తల్లి రాజేశ్వరి( Rajeshwari ) మాత్రం పూర్తిగా విరుద్ధం.ఆమె తన పిల్లలు బాగా సంపాదించాలని, సినిమాల్లో హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగిపోవాలని, తాను జీవితంలో నటిగా ఎదగలేదు కాబట్టి తన పిల్లలైనా సరే హీరోయిన్స్ గా కొనసాగాలని ఆమె కోరుకుంది.

అందుకు తగ్గట్టుగా పక్కా ప్రణాళికతో చిన్నతనం నుంచే నటించడం అలవాటు చేసింది.

అసలే ఆర్థికంగా అంతంత మాత్రం.పైగా భర్త కూడా లేడు.ఒక చంటి బిడ్డతో మద్రాసులో బ్రతకడం చాలా కష్టం.

Advertisement

మొదటి నుంచి సినిమాలంటే రాజేశ్వరికి ఇష్టం.కానీ ఆమె సినిమాలకు సరిపోయే పర్సనాలిటీ కాదు.

దాంతో అయ్యప్ప శర్మ( Ayyappa Sharma ) అని ఒక లాయర్ ను రెండో పెళ్లి చేసుకుంది.అది పెళ్లా లేదా సహజీవనమా అనే విషయం కూడా క్లారిటీ లేదు.

అతనితో శ్రీదేవి మరియు ఆమె చెల్లి శ్రీలతలకు జన్మనిచ్చింది.సరే పోనీ అయ్యప్ప ఏమైనా ఆవిరిని ఆదుకుంటాడా అంటే అది లేదు.

ఆయన అతను యావదాస్తీ తన మొదటి భార్య సంతానానికి ఇచ్చేసి కేవలం తండ్రి అనే హోదా మాత్రమే శ్రీదేవి, శ్రీలతలకు ఇచ్చాడు.ఆర్థిక అవసరాలు తీరడం కోసం ఆమె తన పిల్లలను సినిమాల్లోకి పంపించాలని చూసింది.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!

దాంతో శ్రీదేవి తల్లి వల్ల చైల్డ్ ఆర్టిస్ట్( child artist ) అయ్యింది.కానీ శ్రీలతకు హీరోయిన్ అయ్యే లేదా నటి అయ్యే సీన్ లేదు.దాంతో ఆమె శ్రీదేవిని మాత్రమే పూర్తిస్థాయిలో ఇండస్ట్రీకి పరిమితం చేసింది.

Advertisement

ఎలా అయినా శ్రీదేవిని సైతం హీరోయిన్ చేయాలని అనుకున్నా కానీ ఆ ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కాకపోవడంతో ఆమె సైలెంట్ గా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.ఇలా ఏ తల్లి కూడా చేయకూడని పనులన్నీ శ్రీదేవి తల్లి చేసింది.

కానీ ఎప్పుడైతే ఆమె తన జీవిత చరమాంకంకి చేరుకుందో అప్పుడు శ్రీదేవి విషయంలో ఎంతో బాధకు గురైంది.ఎలాగైనా తన కూతుర్ని ఒక అయ్య చేతిలో పెట్టి కన్నుమూయాలని పరితపించింది.

తాజా వార్తలు