కీర్తి సురేష్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌ సెలబ్రెటీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి ఈమద్య కాస్త తన నోరును అదుపులో పెట్టుకున్నట్లుగా అనిపిస్తుంది.అప్పుడప్పుడు మాత్రమే ఈమె కామెంట్స్‌ చేస్తూ ఉంది.

టాలీవుడ్‌, కోలీవుడ్‌ స్టార్స్‌తో పాటు క్రికెట్‌ దేవుడిపై కూడా ఈమె నింద వేసిన విషయం తెల్సిందే.ఇంతటి వివాదాస్పద తార తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చింది.

కీర్తి సురేష్‌ పై ఈసారి తనదైన శైలిలో విరుచుకు పడటంతో పాటు, ఆమెకు సంబంధించిన విషయాలను తీవ్రంగా విమర్శించింది.

ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్న శ్రీరెడ్డి తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన వారిపైనే తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ, వారినే తనదైన శైలిలో విమర్శిస్తుంది.ఆమద్య నడిగర్‌ సంఘం అధ్యక్షుడు విశాల్‌కు శ్రీరెడ్డికి మాటల యుద్దం జరిగిన విషయం తెల్సిందే.వీరిద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు.

Advertisement

తాజాగా ‘పందెంకోడి 2’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మీడియా సమావేశంలో మాట్లాడిన విశాల్‌ మరోసారి శ్రీరెడ్డి ఇష్యూను తీసుకు వచ్చాడు.శ్రీరెడ్డి గురించి మాట్లాడిన సమయంలో హీరోయిన్‌ కీర్తి సురేష్‌ పక్కనే ఉంది.

తనపై విశాల్‌ విమర్శలు చేస్తున్న సమయంలో పక్కన ఉన్న కీర్తి సురేష్‌ ముసిముసి నవ్వులు నవ్వడంపై శ్రీరెడ్డి తీవ్రంగా స్పందించింది.తనలాంటి వారి కష్టాలు మీకు వస్తే అప్పుడు ఇలా నవ్వరు అని, ఏదో ఒక రోజు తనలాంటి వారి బాధలు మీకు అర్థం అవుతాయి, అప్పుడు ఇలాంటి వెకిలి నవ్వులు నవ్వవు అంటూ కీర్తి సురేష్‌పై శ్రీరెడ్డి కామెంట్స్‌ చేసింది.

ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమలో శ్రీరెడ్డి రెండు మూడు సినిమాలు చేస్తోంది.అందులో మొదటిది ‘రెడ్డి డైరీ’ దాదాపుగా షూటింగ్‌ ముగింపుకు వచ్చినట్లుగా తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.ఇలాంటి సమయంలో శ్రీరెడ్డి ఇతర స్టార్స్‌ పై విమర్శలు చేయకుండా సినిమాల్లో బిజీ అవ్వాలని కొందరు సలహా ఇస్తున్నారు.

కాని శ్రీరెడ్డి మాత్రం ఎప్పుడు ఏదో ఒక వివాదం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది.

Plinko: Pagos Y Acceso A La Cuenta — Guía Práctica Para Jugadores En Chile
Advertisement